బాధితుడికి ‘చిలకం’ ఆర్థికసాయం

Dec 19,2023 22:00

 ఆర్థికసాయం అందజేస్తున్న ‘చిలకం’

                ధర్మవరం టౌన్‌ : పట్టణంలోని రాంనగర్‌కు చెందిన చింతారమణదాస్‌ కుమారుడి వైద్య చికిత్సల కోసం జనసేన పార్టీ రాష్ట్ర ప్రదానకార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి ఆర్థికసాయం అందజేశారు. చింతరమణదాసు కుమారుడు ధర్మతేజ ఇటీవల విద్యుత్‌ షాక్‌తో తీవ్రంగా గాయపడి బెంగుళూర్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. అయితే వైద్యచికిత్సల కోసం తండ్రి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న చిలకం మధసూదన్‌రెడ్డి స్పందించి రూ.10వేల నగదును తన నివాసంలో మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొత్తపేట ఆది, నరేష్‌నాయుడు, అఖిల్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️