సంక్షేమ పాలనను గెలిపించుకుందాం

Apr 28,2024 22:29

 ప్రజలకు నమస్కరిస్తున్న వై.విశ్వేశ్వరరెడ్డి

                వజ్రకరూరు : ఐదు సంవత్సరాలు ప్రజా సంక్షేమ పాలన అందించిన వైసిపి ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించి గెలిపించుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుందామని వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి వై.విశ్వేశ్వర్‌రెడ్డి పిలుపు నిచ్చారు. ఆదివారం వజ్రకరూరు, కమలపాడు, కమలపాడు తండా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ఇప్పుడు కూడా మరోసారి మోసం చేసేందుకు బిజెపి, జనసేన పార్టీలతో జతకట్టి వస్తున్నాడన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు విశ్వేశ్వరరెడ్డి, శంకరనారాయణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. పలువురు వైసిపిలో చేరిక ఉరవకొండకు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు వైసిపిలో చేరారు. వీరికి యువజన విభాగం రాయలసీమ జిల్లాల జోనల్‌ ఇన్‌ఛార్జి ప్రణరురెడ్డి కండువాలు కప్పి ఆహ్వానించారు. అంబేద్కర్‌ నగర్‌కు చెందిన నాగరాజుతోపాటు 10మంది ఎస్సీ కుటుంబాలకు చెందిన సాకే శంకర్‌, హమాలీ కాలనీ కుళ్లాయప్ప, అంజి, తదితరులు వైసిపిలో చేరారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.ప్రజలకు అందుబాటులో ఉండే విశ్వన్నను గెలిపించాలినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేసే వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి వై.విశ్వేశ్వరరెడ్డిని గెలిపించుకుంటేనే అభివృద్ధి సాధ్యమని ఆయన తనయుడు, యువజన విభాగం రాయలసీమ జిల్లాల జోనల్‌ ఇన్‌ఛార్జి వై.ప్రణరురెడ్డి అన్నారు. ఆదివారం ఉరవకొండ పట్టణంలోని 1, 3వ వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా 3వ వార్డులో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఫ్యాను గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేగా వై.విశ్వేశ్వరరెడ్డి, అనంతపురం ఎంపీ అభ్యర్థిగా శంకరనారాయణను అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని పాతపేట, కురువగేరి ప్రాంతాల్లో వై.విశ్వేశ్వరరెడ్డి సతీమణి వై. భువనేశ్వరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ఓటును అభ్యర్తించారు.

➡️