ఆభరణాల మాయం వెనకెవరు?

గార స్టేట్‌బ్యాంకు శాఖలో ఆభరణాల గల్లంతుపై పోలీసులు లోతుగా విచారణ మొదలుపెట్టారు. బ్యాంకు ఉద్యోగుల్లో ఒక్కొక్కరి నుంచి వివరాలు రాబడుతున్నారు. ఖాతాదారుల నుంచీ స్టేట్‌మెంట్లను తీసుకుంటున్నారు. గల్లంతైన బంగరాం విలువ రూ.4.07 కోట్లని అధికారులు

బ్యాంకు వద్ద ఆందోళన చేస్తున్న ఖాతాదారులు

బంగారు ఆభరణాలపై మూడు నెలలకోసారి ఆడిట్‌

తెలిసినా బయటకు పొక్కకుండా దాచిపెట్టారా?

అధికారుల పాత్రపై అనుమానాలుొబ్యాంకు వద్ద ఖాతాదారుల ఆందోళన

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

గార స్టేట్‌బ్యాంకు శాఖలో ఆభరణాల గల్లంతుపై పోలీసులు లోతుగా విచారణ మొదలుపెట్టారు. బ్యాంకు ఉద్యోగుల్లో ఒక్కొక్కరి నుంచి వివరాలు రాబడుతున్నారు. ఖాతాదారుల నుంచీ స్టేట్‌మెంట్లను తీసుకుంటున్నారు. గల్లంతైన బంగరాం విలువ రూ.4.07 కోట్లని అధికారులు చెప్తున్నా, అంతకంటే ఎక్కువే ఉంటుందన్న చర్చ సాగుతోంది. బ్యాంకులో అవకతవకలకు బాధ్యులని చేస్తూ క్యాషియర్‌ మంజు సురేష్‌, సర్వీస్‌ మేనేజర్‌ స్వప్నప్రియను అధికారులు సస్పెండ్‌ చేశారు. ఇందులో స్వప్నప్రియ కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వ్యక్తిగత అవసరాల కోసం ఓ లోన్‌ కన్సల్టింగ్‌ నిర్వాహకుని సాయంతో ప్రయివేట్‌ ఆర్థిక సంస్థల్లో బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టినట్లు ఇప్పటికే అంగీకరించారు. మనస్తాపానికి గురైన స్వప్నప్రియ ఈనెల 29న ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆడిట్‌, ఇతర తనిఖీల్లో ఖాతాదారులు కుదవ పెట్టిన బంగారం సరిగా ఉందా, లేదా అని పరిశీలించిన సందర్భంలో లెక్క తప్పినా చూసీచూడనట్టు వ్యవహరించారా?, ఖాతాదారులు ఇప్పట్లో విడిపించరని భావించారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బంగారంపై అప్పు తీసుకున్న వారు పూర్తిగా డబ్బులు చెల్లించి తమ నగలను తమకు అప్పగించాలని కోరడంతో రెండు రోజుల తర్వాత రావాలని సూచించారు. ఎస్‌బిఐ రీజనల్‌ మేనేజర్‌ మాత్రం బ్యాంకులో ఆడిట్‌ జరుగుతోందని, డిసెంబర్‌ ఎనిమిదో తేదీ నాటికి ఖాతాదారులకు నగలు అప్పగిస్తామని హామీ ఇచ్చినట్లు బాధితులు చెప్తున్నారు. తాకట్టు పెట్టిన బంగారంపై ప్రతి మూడు నెలలకోసారి అధికారులు ఆడిట్‌ చేస్తారు. ఆడిట్‌లో బయటపడినా, విషయాన్ని దాచిపెట్టారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. బ్యాంకులో ఇంత పెద్ద మొత్తంలో ఆభరణాలు గల్లంతు కావడంలో కేవలం ఒక్క ఉద్యోగి ఇంత పెద్ద రిస్క్‌ తీసుకుంటారా, బ్యాంకుకు చెందిన అధికారులెవరైనా ఉన్నారా అనే అనుమనాలు వ్యక్తమవుతున్నాయి.ఖాతాదారుల ఆందోళనబ్యాంకులో ఆభరణాలు గల్లంతు కావడంపై ఖాతాదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బంగారు నగలు మాయమయ్యాయనే విషయం తెలుసుకుని శుక్రవారం బ్యాంకు దగ్గరకు చేరుకున్నారు. బ్యాంకు కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. తాము కుదవ పెట్టిన బంగారాన్ని తిరిగి తమకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

 

➡️