ఇచ్ఛాపురం టిడిపికి కంచుకోట

టిడిపి పార్టీ ఆవిర్భావం నుంచి ఒకే ఒకసారి మాత్రమే ఇచ్ఛాపురంలో టిడిపి ఓటమి

బైక్‌ ర్యాలీలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే

ఎంపీ రామ్మోహన్‌ నాయుడు

ప్రజాశక్తి- ఇచ్ఛాపురం

టిడిపి పార్టీ ఆవిర్భావం నుంచి ఒకే ఒకసారి మాత్రమే ఇచ్ఛాపురంలో టిడిపి ఓటమి చూసిందని, ఎప్పుడూ టిడిపికి ప్రజలు అండగా నిలిచి కంచుకోట చేశారని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. అయోధ్య నుంచి ఇచ్ఛాపురం చేరుకొని గ్రామ దేవత స్వేచ్ఛా వతి అమ్మవారు ఆలయాన్ని సందర్శించారు. అక్కడ నుంచి కార్యకర్తలతో కలిసి ఈదుపురం రోడ్డు వరకు మంగళవారం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీ నిధులతో నిర్మించిన ఎల్లమ్మ ఆలయం వద్ద కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభం చేశారు. బిసి సాధికారిత సమితి కన్వీనర్‌ కొండ శంకర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. టిడిపిని ఓడించే దమ్ము ఎవ్వరికీ లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అరాచక పాలనా అంతానికి నడుం కట్టాలని పిలుపునిచ్చారు. పరదాల చాటు పర్యటించే ముఖ్యమంత్రి ఎక్కడా లేదని విమర్శించారు. ఎమ్మెల్యే అశోక్‌ మాట్లాడుతూ ఒక్క ఛాన్స్‌ అని చెప్పి ప్రజల జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేశారని విమర్శించారు. అనంతరం వైసిపి నుంచి చేరిన మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఆసి చిరంజీవిరెడ్డితో పాటు మరో వంద కుటుంబాలకు పార్టీ కండువ వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు సాలీనా ఢిల్లీయాదవ్‌, దక్కత ఢిల్లీరావు, నందిక జాని, పి.తవిటయ్య, కాళ్ల జయదేవ్‌, కాళ్ల దిలీప్‌కుమార్‌, సీపాన వెంకటరమణ, సదానంద రోలో, ఆసీ లీలారాణి, మణిచంద్ర ప్రకాష్‌ పాల్గొన్నారు.

 

➡️