ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

స్థానిక యుటిఎఫ్‌ కార్యాలయంలో ముఖ్య బాధ్యుల సమావేశం ఆ సంఘ జిల్లా అధ్యక్షులు ఎల్‌.బాబూరావు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో

మాట్లాడుతున్న శ్రీరామ్మూర్తి

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

స్థానిక యుటిఎఫ్‌ కార్యాలయంలో ముఖ్య బాధ్యుల సమావేశం ఆ సంఘ జిల్లా అధ్యక్షులు ఎల్‌.బాబూరావు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బి.శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ 39వ జిల్లా కౌన్సిల్‌ సమావేశాలు కోటబొమ్మాళిలో 3న ఘనంగా జరిగాయని ఈ సందర్భంగా కౌన్సిల్‌లో పలు భవిష్యత్‌ కర్తవ్యాలు తీసుకోవడం జరిగిందన్నారు. నూతన కమిటీ రాబోయే కాలంలో విద్యారంగ పరిరక్షణ కోసం, జిల్లాలో ఉపాధ్యాయుల సమస్యలపై పనిచేస్తుం దన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి చౌదరి రవీంద్ర, జిల్లా సహాధ్యక్షులు కె. దాలయ్య, బి ధనలక్ష్మి, కోశాధికారి బి.రవికుమార్‌, రాష్ట్ర కౌన్సిలర్లు పి.అప్పారావు, ఎస్‌.కిషోర్‌ కుమార్‌ పాల్గొన్నారు.

 

➡️