‘ఎలుగు’పై అప్రమత్తం

ఉద్దాన ప్రాంతంలో ఎలుగు సంచరిస్తూందని ప్రతిఒక్కరూ

అవగాహన కల్పిస్తున్న అటవీశాఖ అధికారులు

‘ప్రజాశక్తి’ కథనానికి స్పందన

ప్రజాశక్తి- పలాస

ఉద్దాన ప్రాంతంలో ఎలుగు సంచరిస్తూందని ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కాశీబుగ్గ అటవీశాఖ రేంజర్‌ మురళీకృష్ణంనాయుడు రైతులకు, ప్రజలకు సూచించారు. ‘ప్రజాశక్తి’లో గురువారం ఎలుగు సంచారం అనే శీర్షికతో వెలువడిన కథనానికి అటవీ శాఖ అధికారులు స్పందించారు. పలాస మండలం మామిడిపల్లి, బొడ్డపాడు గ్రామాల్లో అటవీశాఖ అధికారులు పర్యటించి ప్రజలకు అప్రమత్తం చేశారు. రాత్రి వేళల్లో బయట తిరిగరాదన్నారు. తెల్లవారుజామున వేళల్లో తోటలకు వెళ్లవద్దని సూచించారు. ఒంటరిగా తిరగరాదని, కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని అన్నారు.

 

➡️