జీడికి మద్దతు ధర ప్రకటించాలి

జీడి పంటకు మద్దతు ధరపై ప్రభుత్వ స్పష్టమైన వైఖరి ప్రకటించాలని ఎఐకెఎంఎస్‌ రాష్ట్ర నాయకులు వంకల మాధవరావు ప్రభుత్వనికి డిమాండ్‌ చేశారు. ఎఐకెఎంఎస్‌ జిల్లా అధ్యక్షులు మామిడి భీమారావు అధ్యక్షతన రట్టి, బేతాలపురం, మర్రిపాడు గ్రామాల్లో జీడి రైతులతో

మాట్లాడుతున్న మాధవరావు

ప్రజాశక్తి- మందస

జీడి పంటకు మద్దతు ధరపై ప్రభుత్వ స్పష్టమైన వైఖరి ప్రకటించాలని ఎఐకెఎంఎస్‌ రాష్ట్ర నాయకులు వంకల మాధవరావు ప్రభుత్వనికి డిమాండ్‌ చేశారు. ఎఐకెఎంఎస్‌ జిల్లా అధ్యక్షులు మామిడి భీమారావు అధ్యక్షతన రట్టి, బేతాలపురం, మర్రిపాడు గ్రామాల్లో జీడి రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే 80 కిలోల జీడి పంటను బస్తాకు రూ.16 వేలు గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయాలన్నారు. ప్రభుత్వమే కొనుగోలు చేసి జీడి పరిశ్రమలకు సరఫరా చేయాలన్నారు. ఈ ఏడాది వర్షాలు తక్కువ కావడంతో ఇప్పటివరకు జీడి పూత రాకపోవడంతో రైతులు సంక్షోభంలో ఉన్నారన్నారు. ఎరువులు, పురుగు మందులు పెట్టుబడులు పెరుగుతు న్నాయని అన్నారు. ప్రభుత్వం విదేశీ జీడి పిక్కలను స్వదేశీ పిక్కలు పూర్తయ్యేంతవరకు దిగుమతికి అనుమతించరాదని కోరారు. సమావేశంలో వెంకటరావు, దాలయ్య, కృష్ణారావు, మోహనరావు, భగీరథ, బాలయ్య పాల్గొన్నారు.

 

➡️