నేడు బాధ్యతల స్వీకరణ

జిల్లాకు కొత్త కలెక్టర్‌గా నియమితులైన

జిల్లాకు చేరుకున్న కొత్త కలెక్టర్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం

ప్రతినిధిజిల్లాకు కొత్త కలెక్టర్‌గా నియమితులైన మనజీర్‌ జిలానీ సమూన్‌ కుటుంబసభ్యులతో కలిసి గురువారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు. శ్రీకాకుళం నగరంలోని ఒక హోటల్‌లో బస చేసిన ఆయనకు పలువురు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఎస్‌పి జి.ఆర్‌ రాధిక, జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, టెక్కలి సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, డిఆర్‌ఒ ఎం.గణపతిరావు, ఆర్‌డిఒలు ఎస్‌.భరత్‌నాయక్‌, సిహెచ్‌.రంగయ్య, డిఐపిఆర్‌ఒ ఎడి చెన్నకేశవులు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ చల్లా ఓబులేసు, రెవెన్యూ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు శ్రీరాములు తదితరులున్నారు.

➡️