5న డిఇఒ కార్యాలయం వద్ద మహాధర్నా

మధ్యాహ్న భోజన

మాట్లాడుతున్న మహాలక్ష్మి

  • మధ్యాహ్న భోజన పథకం సంఘ గౌరవాధ్యక్షులు మహాలక్ష్మి

ప్రజాశక్తి- కొత్తూరు

మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ… ఫిబ్రవరి 5న డిఇఒ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నామని, దీనిని విజయవంతం చేయాలని ఆ సంఘం గౌరవ అధ్యక్షులు అల్లు మహాలక్ష్మి పిలుపునిచ్చారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికుల సంఘం మండల అధ్యక్షులు కింజరాపు ఉమ అధ్యక్షతన ఆదివారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో మధ్యాహ్న భోన పథక వంట కార్మికులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వంట కార్మికులకు కనీస వేతనం రూ.పది వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. యూనిఫారాలు ఉచితంగా పంపిణీ చేశారు. ప్రమాదా బీమా వర్తింపజేయాలన్నారు. విద్యార్థులకు పెడుతున్న మెనూ ఛార్జీలను పెంచాలని డిమాండ్‌ చేశారు. ప్రజా సంఘాల నాయకులు సిర్ల ప్రసాద్‌ మాట్లాడారు. అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్ష, కార్యదర్శులుగా ఎం.లక్ష్మి, కె.ఉమ, కమిటీ సభ్యులుగా ఆదెమ్మ, జగదాంబ, ఆరుద్రమ్మ, చింతాడ ఆరుద్రమ్మలను ఎన్నుకున్నారు.

 

 

➡️