‘వైసిపితో అభివృద్ధి, సంక్షేమం’

అభివృద్ది, సంక్షేమం వైసిపితోనే సాధ్యమని వైసిపి ఎమ్మెల్యే

పోలాకి : ప్రచారం చేస్తున్న కృష్ణదాస్‌

ప్రజాశక్తి- పొందూరు

అభివృద్ది, సంక్షేమం వైసిపితోనే సాధ్యమని వైసిపి ఎమ్మెల్యే అభ్యర్ధి, స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. మండలం తుంగపేటలో శనివారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి చేపట్టిన అభివృద్దిని వివరిస్తూ తనకు మరో అవకాశం కల్పించాలని కోరారు. ఈయనతో పాటు రాష్ట్ర కళింగ కార్పోరేషన్‌ చైర్మన్‌ దుంపల లక్ష్మణరావు, ఎంపిపి కిల్లి ఉషారాణి, జెడ్‌పిటిసి లోలుగు కాంతారావు, వైసిపి మండల అధ్యక్షుడు పప్పల రమేష్‌కుమార్‌, పిఎసిఎస్‌ అధ్యక్షులు కొంచాడ రమణమూర్తి, ఎఎంసి చైర్మన్‌ సునీల్‌కుమార్‌ పాల్గొన్నారు.ఆమదాలవలస: మండలంలోని జి.కె.వలసలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఇంటింటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో వైసిపికి ఓటు వేసి మరొక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక ఆహ్వానితుడు తమ్మినేని శ్రీరామ్మూర్తి, జెడ్‌పిటిసి బెండి గోవిందరావు, పిఎసిఎస్‌ అధ్యక్షులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, పిఎసిఎస్‌ డైరెక్టర్‌ నక్క కన్నబాబు పాల్గొన్నారు.లావేరు: పోతయ్యవలస, వెంకటాపురం పంచాయతీల్లో ఎచ్చెర్ల ఎమ్మెల్యే అభ్యర్థి గొర్లె కిరణ్‌కుమార్‌ ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్‌ గుర్తుపై ఓట్లువేసి తనను గెలిపించాలని ఉపాధి కూలీలను కోరారు. కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి రొక్కం బాలకృష్ణ, జెడ్‌పిటిసి మీసాల సీతంనాయుడు, డి.రాజనాయుడు, జెసిఎస్‌ ఇన్‌ఛార్జి మీసాల శ్రీనువాసరావు, బురాడ చిన్నారావు పాల్గొన్నారు. పోలాకి : మండలంలోని రాళ్లపాడు, ముప్పిడి గ్రామాల్లో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్‌ ఎన్నికల ప్రచారాన్ని శనివారం నిర్వహించారు. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బిసి సెల్‌ జోనల్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జి డాక్టర్‌ ధర్మాన కృష్ణచైతన్య, వైసిపి సిఇసి సభ్యురాలు ధర్మాన పద్మప్రియ, డిసిసిబి చైర్మన్‌ కరిమి రాజేశ్వరరావు, ఎంపిపి ముద్దాడ భైరాగినాయుడు, కళింగ కోమటి కార్పొరేషన్‌ చైర్మన్‌ అంధవరపు సూరిబాబు, పెద్దలు పాగోటి అప్పారావు, మండల పార్టీ అధ్యక్షులు కణితి కృష్ణారావు, పాల్గొన్నారు. ఇచ్ఛాపురం : వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ డైలీ మార్కెట్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వ్యాపారులను కలుసుకుని ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టౌన్‌ పార్టీ అధ్యక్షులు బలివాడ ప్రకాష్‌ పట్నాయక్‌, టౌన్‌ జెసిఎస్‌ అధ్యక్షులు సాలిన ఢిల్లీరావు, వార్డు కౌన్సిలర్లు జగన్నాథ్‌రెడ్డి, నీలాపు లక్ష్మి, పరపతి మంజులత, సిగ్గు ప్రేమ్‌కుమార్‌ పాల్గొన్నారు. సంతబొమ్మాళి : మండలంలోని మేఘవరం పంచాయతీలో సూరాడవానిపేట, మరువాడ పంచాయతీల్లో ఎం.మరువాడ, డి.మరువాడ, చొక్కరవానిపేట, గుడ్డిమీదపేటల్లో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు వైసిపి తీర్ధం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి పాల వసంతరెడ్డి, పిఎసిఎస్‌ చైర్మన్‌ కెల్లి జగన్నాయకులు, వైస్‌ ఎంపిపి ప్రతినిధులు నక్క భీమారావు, పొందల రామకృష్ణ, వైసిపి మండల పార్టీ అధ్యక్షులు కోత సతీష్‌ పాల్గొన్నారు. టెక్కలి రూరల్‌ : టెక్కలి పంచాయతీలో వంశధార కాలనీ, రోటరీనగర్‌ 1,2,3,4లో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గొండేల సుజాత, ఎంపిటిసిలు కూన పార్వతి, పీత హేమలత, అనంతయ్య, చింతాడ గణపతి, టెక్కలి టౌన్‌ అధ్యక్షులు తమ్మన్నగారి కిరణ్‌, మండల పార్టీ అధ్యక్షులు కిల్లి అజరు, జెసిఎస్‌ మండల కన్వీనర్‌ శిగిలిపల్లి మోహన్‌, పిఎసిఎస్‌ అధ్యక్షులు సత్తారు సత్యం పాల్గొన్నారు. కోటబొమ్మాళి: వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌, ఎంపీ అభ్యర్థి పి.తిలక్‌లకు మద్దతుగా ఎంపిపి రోణంకి ఉమామల్లేశ్వరావు, మండల పార్టీ అధ్యక్షుడు నూక సత్యరాజు, పిఎసిఎస్‌ అధ్యక్షులు బాడాన మురళిలు కొత్తపేట పంచాయతీ ఇందిరమ్మ కాలనీ, తారకరామ కాలనీలో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి దుక్క రోజా, జెసిఎస్‌ మండల కన్వీనర్‌ నాగభూషణ్‌, జిల్లా రైతు భరోసా అడ్వెయిజరీ కమిటీ సభ్యులు కవిటి రామరాజు, సర్పంచ్‌ రామపాత్రుని సావిత్రి, కో-ఆప్షన్‌ సభ్యులు షేక్‌ రాజు పాల్గొన్నారు.

➡️