గొడవలకు తావివ్వొద్దు

త్వరలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు

బూర్జ : గ్రామస్తులతో మాట్లాడుతున్న సిఐ

ప్రజాశక్తి- బూర్జ

త్వరలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు ప్రజలంతా సహకరించాలని ఆమదాలవలస సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ దివాకర్‌ యాదవ్‌ కోరారు. శనివారం మండలంలోని ఉప్పినివలసలో ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు తగాదాలకు, కొట్లాటకు పోవరాదని సూచించారు. కుటుంబ భద్రత, భవిష్యత్‌ కోసం ఆలోచన చేసి శాంతియుతంగా ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో బూర్జ పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.ఆమదాలవలస: మండలంలోని సమస్యాత్మక గ్రామమైన చిన్న జొన్నవలసలో ఎస్‌ఐ వెంకటేష్‌ ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతిఒక్కరు ఓటుహక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.పొందూరు: మండలం వి.ఆర్‌.గూడెంలో ఎస్‌ఐ రవికుమార్‌ గ్రామస్తులతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎఎస్‌ఐ సువ్వారి రామచంద్రరావు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

 

➡️