వివాదాల జోలికి వెళ్తే కఠిన చర్యలు

ప్రశాంతంగా ఉన్న పట్టణంలో రాజకీయ దురుద్దేశాలతో వి

పట్టుబడిన ద్విచక్ర వాహనాలతో ఎస్‌ఐ వెంకటేష్‌

ప్రజాశక్తి- ఆమదాలవలస

ప్రశాంతంగా ఉన్న పట్టణంలో రాజకీయ దురుద్దేశాలతో వివాదాలు సృష్టించే వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ కె.వెంకటేష్‌ హెచ్చరించారు. గురువారం పురపాలక సంఘంలోని 14వ వార్డు ఐజె నాయుడు కాలనీలో పోలీస్‌ సిబ్బందితో కలిసి కార్డాన్‌ సెర్చ్‌, ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో సోదాలు నిర్వహించగా ఎటువంటి పత్రాలు లేని మూడు ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటిని సీజ్‌ చేశారు. అనంతరం ఎస్‌ఐ వెంకటేష్‌ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన చిన్నపాటి మనస్పర్ధలను మరచిపోయి ఎప్పటిలా కాలనీలో ఉన్న కుటుంబాలన్ని ఐకమత్యంగా ఉండాలని తెలిపారు. కొంతమంది కావాలనే రాజకీయ లబ్ధికోసం శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారని అటువంటి వారిని గుర్తించి కఠినచర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ- 2 నాగరాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

 

➡️