ప్రేరణ ఉత్సవ్‌లో విద్యార్థుల ప్రతిభ

జిల్లాలోని వెన్నెల వలసలో ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయంలో

మైత్రి ముంజి

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

జిల్లాలోని వెన్నెల వలసలో ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయంలో గత నెల 19న నిర్వహించిన ప్రేరణ ఉత్సవ్‌లో వివిధ పోటీల్లో పాతటెక్కలి జెడ్‌పి హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న లమ్మత అఖిల్‌, టెక్కలి కెజిబివిలో పదోతరగతి చదువుతున్న మైత్రి ముంజి ఎంపికయ్యారు. జిల్లా స్థాయి ప్రేరణ ఉత్సవ్‌లో 30 మండలాల నుంచి 60 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరంతా మండల స్థాయిలో విజేతలుగా నిలిచిన వారే. వారితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమక్షంలో జిల్లా స్థాయిలో వ్యాసరచన, డ్రాయింగ్‌, పద్యరచన పోటీలను నిర్వహించారు. పోటీలో ఎంపికైన 30 మందికి ముఖాముఖి నిర్వహించి శనివారం వీరిద్దర్ని ఎంపిక చేశారు. వీరిని గుజరాత్‌లోని వాడ్న గర్‌లో ఏడు రోజుల పాటు రెసిడెన్షియల్‌ శిక్షణ ఇవ్వనున్నట్టు వెన్నెలవలస జవహర్‌ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్‌. డి.పరశురామయ్య, సమగ్ర శిక్ష ఎఎంఒ జి.లక్ష్మీ నారాయణ తెలిపారు. జాతీయ స్థాయిలో ఉత్తమ విద్యార్థులుగా వీరు రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని డిఇఒ వెంకటేశ్వరరావు, సమగ్రశిక్ష ఎపిసి డాక్టర్‌ రోణంకి జయప్రకాష్‌లు సూచించారు. విద్యార్థులను వారు అభినందించారు.

 

➡️