సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు

Mar 12,2024 15:35 #anathapuram, #police, #si waring
  •  నార్పల ఎస్‌ఐ రాజశేఖర్‌ రెడ్డి

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని నార్పల ఎస్‌ఐ రాజశేఖర్‌ రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన చిత్రాలు, వీడియోలను పోస్ట్‌ చేయవద్దని, వ్యక్తిగత దూషణకు దిగడం, వార్నింగ్‌ ఇవ్వడం, అంతర్గత వివరాలు గురించి అనవసర పోస్టులు, కామెంట్స్‌, సోషల్‌ మీడియాలో పెట్టవద్దని సూచించారు. సోషల్‌ మీడియాలో తప్పుడు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిని పోలీసులు నిరంతరం గమనిస్తూనే ఉంటారని, అలాంటి వారిపై చట్టప్రకారం కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేసేటప్పుడు జాగ్రత్తగా అప్రమత్తతో వ్యవహరించాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని, ముఖ్యంగా యువత, వారి భవిష్యత్తును అనవసర పోస్ట్‌ల ద్వారా బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు.

➡️