లక్ష్యంపై దృష్టి సారిస్తే విజయం తప్పనిసరి

ప్రజాశక్తి-వేటపాలెం: సెయింట్‌ ఆన్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజి బి టెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగం) ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగ విద్యార్థులు వీడ్కోలు సభ నిర్వహించినట్లు కరస్పాండెంట్‌ శ్రీమంతుల లక్ష్మణరావు బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు వీడ్కోలు సభ జరిగినది. ఈ సందర్భంగా కళాశాల ప్రధాన అధ్యాపకులు డాక్టర్‌ కె జగదీష్‌బాబు మాట్లాడుతూ కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులు ఆధునిక టెక్నాలజీలపై అవగాహనను పెంపొందించుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడాలని ఆకాంక్షించారు. అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని వైఫల్యాలను అధిగమించి లక్ష్య సాధనకు ఉపక్రమించి, అనుకున్న లక్ష్యాలపై దృష్టిని సారించినట్లయితే తప్పక విజయం సాధించవచ్చని అన్నారు. కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగాధిపతి పి హరిణి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి జీవితంలో ఉన్నత స్థాయిలో పూరోభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగం మూడో సంవత్సరం విద్యార్థులు ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు జ్ఞాపికలను అందజేశారు. ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తమ సందేశాలను వినిపించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో సి సుబ్బారావు, డైరెక్టర్‌ (అక్రిడిటేషన్స్‌), అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌ ఆర్‌వి రమణమూర్తి, వివిధ విభాగాధిపతులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.

➡️