కరువు సహాయం చర్యలు చేపట్టండి : ఏపీ రైతు సంఘం

ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : మండలంలో కరువు సహాయ చర్యలు చేపట్టాలని శనివారం ఆత్మకూరు మండల కేంద్రంలోని సచివాలయ అధికారికి భాను ప్రకాష్‌ కు ఆత్మకూరు సచివాలయం 2లో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు.

రైతు సంఘం మండల కార్యదర్శి రాము మాట్లాడుతూ … మండలంలో కరువు సహాయ చర్యలు చేపట్టాలన్నారు. రైతు అప్పులుమాఫీ చేయాలని కోరారు. పంట నష్టపరిహారం కౌలు రైతులకు నష్టపరిహారం అందించాలన్నారు. ఉపాధి హామీ పనులు 200 రోజులు కల్పించాలని, రోజు కూలి ఆరు వందల రూపాయలు ఇవ్వాలని కోరారు. ఆయా జిల్లాలో ఈ సంవత్సరం తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయనీ, రబీ లో వేయాల్సిన పంట అదును కూడా దాటిపోయిందని చెప్పారు. హెచ్‌ ఎల్‌ సి హాద్రినివా కాల్వ కింద వేసిన మిరప, మొక్కజన్న, తదితర పంటలు చేతికి వచ్చే సమయంలో కాల్వకు నీరుపారుదల అధికారులు నీరు నిలిపివేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పంటలు పూర్తి అయ్యేవరకు నీరు ఇవ్వాలనే రైతుల డిమాండ్‌ ను పట్టించుకునేవారు లేరు అని మండిపడ్డారు. దీనివల్ల 60000 మిరప పంట మెరప హెక్టార్లు సాగుచేసిన మిరప పంట రైతులు కోట్ల రూపాయలు పెట్టుబడి నష్టపోతున్నారు అని వివరించారు.

ఈ పరిస్థితులలో రైతులను ఉదారంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు. అక్టోబర్‌ 31 వ తేదీ హడావుడిగా కరువు మండలాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని అయితే సహాయ చర్యలను చేపట్టకుండా కరువు ప్రకటనతో రైతులలో విశ్వాసం కలగదు అని స్పష్టం చేశారు. వేరుశనగ, కంది, తదితర పంటలకు ఎగరాకు 50 వేల రూపాయలు మిరప పంటకు ఎకరాకు లక్ష రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, వలసలను నివారించేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రెండు వందల రోజులు కల్పించాలని, రోజు కూలి రూ.600 వేతనం ఇవ్వాలని, పంట సాగు చేసిన కౌలు రైతులకు పంట నష్టపరిహారం అందివ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి శివశంకర్‌, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయులు, ఎన్‌ పి ఆర్‌ డి జిల్లా కార్యదర్శి రామయ్య, తదితరులు పాల్గొన్నారు.

➡️