రోడ్డుకు తాత్కాలిక మరమ్మత్తులు పూర్తి

May 5,2024 17:59 #chitoor, #road
  • యధావిధిగా రోడ్డుపై రాకపోకలు కొనసాగింపు
  • ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు

ప్రజాశక్తి -కోట(తిరుపతిజిల్లా) : మిచ్చాంగ్ తుఫాను వల్ల భారీ వర్షాలు రావడంతో భారీగా ధ్వంసమైన రోడ్డు కు మరమ్మతులు చేపట్టి ప్రస్తుతం రాకపోకలు యధావిధిగా కొనసాగుతున్నాయి.ఈ సందర్బంగా కోట,వాకాడు మండలాల్లోని వంజివాక,అల్లంపాడు, పుచ్చలపల్లి,తూపిలిపాలెం,వాలిమేడు,జమీన్ కొత్తపాలెం గ్రామాలు నుండి గంగన్నపాలెం గ్రామానికి వెళ్లే ముందు భాగంలో మిచాంగ్ తుపాన్ వల్ల సుమారు అర కిలోమీటరు దూరం వరకు రోడ్డు అంతా ధ్వంసమవ్వడంతో రోడ్డు కు ఎలాంటి చిహ్నలు లేకుండా పోవడం జరిగింది.ఈ సన్నివేశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సందర్శించి వెళ్లడం జరిగింది.అయితే ఆర్ అండ్ బి అధికారులు స్పందించి ప్రస్తుతం తాత్కాలికంగా గ్రావెల్ తో రోడ్డు నిర్మాణాన్ని చేపట్టి రాకపోకలు యధావిధిగా కొనసాగుతున్నాయి.దీనితో అనునిత్యం రాకపోకలు కొనసాగడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అదేవిధంగా త్వరలోనే శాశ్వత రోడ్డు నిర్మాణాన్ని చేపడతామని ఆర్ అండ్ బి అధికారులు చెప్తున్నారు.ఇటీవలన రోడ్డు దెబ్బ తినడంతో ప్రయాణికులు వేరే మార్గం గుండా వెళ్లడానికి నానా రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఏదిఏమైనప్పటికీ త్వరలోనే రోడ్డు పనులు పూర్తి చేయడంతో ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నారు.

➡️