చాగల్లు ఇందిరమ్మ కాలనీలో హోంమంత్రి తానేటి వనిత

Nov 24,2023 16:07 #East Godavari

ప్రజాశక్తి-చాగల్లు : చాగల్లు మండలం చాగల్లు గ్రామంలో ఇందిరమ్మకాలనీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత నిర్వహించారు. శుక్రవారం చాగల్లు సచివాలయం – 4 పరిధిలో ఆమె పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్ర‌తి ఇంటికి వెళ్లి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాలుగన్నరేళ్ల పాల‌న‌లో అందించిన సంక్షేమ ప‌థ‌కాల‌ను వివ‌రించారు. స్థానికుల నుంచి వ‌చ్చిన మౌలిక వసతుల కల్పన, రోడ్లు, డ్రైన్ల స‌మ‌స్య‌ల‌పై సంబంధిత అధికారులను పిలిచి ఆదేశాలు జారీ చేశారు. ఇంటింటికి వెళ్లి జగనన్న ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను కుటుంబ సభ్యులకు వివరించారు. వారు పొందిన లబ్ధి వివరాలతో కూడిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతకం చేసిన కరపత్రాలను అందచేశారు. ఈ పర్యటనలో భాగంగా ఇందిరమ్మ కాలనీలోని అంగన్ వాడీ కేంద్రాన్ని, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆమె పరిశీలించారు. అక్కడ ఉన్న చిన్నారులు, విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. చిన్నారులు, విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న జగనన్న గోరుముద్ద పథకం అమలుపై ఆరా తీశారు.  హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కానన్ని సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ లోని జగనన్న ప్రభుత్వంలో మాత్రమే అమలు అవుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓట్లు కోసం రాజకీయం చేయట్లేదని.. పిల్లలకు బంగారు భవిష్యత్ ఇవ్వాలని పరిపాలన అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అనేక విద్యా సంస్కరణలకు శ్రీకారం చుడుతూ.. విద్యార్థులను గ్లోబల్ సిటిజెన్స్ గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. జగనన్న అమ్మఒడి, విద్యాకానుక, ఇంగ్లీష్ మీడియం, కార్పోరేట్, ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ బడులను నాడు-నేడు ద్వారా తీర్చిదిద్దడం, గోరుముద్ద వంటి అనేక కార్యక్రమాలను కేవలం విద్యార్థుల కోసమే ప్రవేశ పెట్టారన్నారు. ఒకవేళ అర్హత ఉండి ఏ సంక్షేమ పధకం అయినా తమకు అందకపోతే.. తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రజల వద్దకు వెళ్లి వారి కుటుంబానికి అందించిన లబ్ధిని వివరిస్తుంటే.. చాలా మంది మా కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ పథకాలు అందుతున్నాయని, జగనన్న పాలన గురించి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అవుతారని ప్రజలు దీవిస్తున్నారని హోంమంత్రి తానేటి వనిత ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉన్నమట్ల మనశ్శాంతి, ఉప సర్పంచ మేకరాజు గంట్రోతు సురేంద్ర కుమార్ చేలంకుల దుర్గా మల్లేశ్వరరావు జుట్ట ఏడుకొండలు గంగవరపు బాబు రాజేంద్రప్రసాద్, ఎంపీడీవో బి రాంప్రసాద్ తాసిల్దార్ కే రాజలక్ష్మి పంచాయతీ కార్యదర్శి ఎల్ రవికుమార్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు

➡️