గాలి, వానకు కుప్పకూలిన టెంట్లు

– ఎన్నికల సామాగ్రి బస్సులలో ఉండడంతో ఊపిరి పిలుచుకున్న అధికారులు ప్రజాశక్తి – పులివెందుల టౌన్‌ పులివెందులలో గాలి వాన బీభత్సం సష్టించడంతో తాత్కాలిక టెంట్లు కుప్పకూలి, కుర్చీలు చెల్లాచెదురుగా పడిపో యాయి. అప్పటికే ఎన్నికల సామగ్రిని బస్సులో చేర్చడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం జెఎన్‌టియు కళాశాలలో ఎన్నికల సామగ్రిని ఎన్నికల అధికారులకు పంపిణీ చేసినందుకు తాత్కాలిక టెంట్లను ఏర్పాటు చేశారు. వర్షం వచ్చే సూచనలు ఉండడంతో అధికారులు ముందుగా గ్రహించి సామగ్రిని బస్సుల్లో ఎక్కించారు. దీంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదు.

➡️