పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేసిన సబ్‌ కలెక్టర్‌

Nov 30,2023 15:17 #Kurnool

ప్రజాశక్తి-ఆదోని(కర్నూలు) : ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ 2024లో భాగంగా గురువారం ఆదోనిలోని పాత టిజిఎల్‌ పాలిటెక్నిక్‌ కళాశాల, నిజాముద్దీన్‌ కాలనీలోని మసూదియా ఉర్దూ పాఠశాల పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల అధికారి, సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ తనిఖీ చేశారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో తాగునీరు, టాయిలెట్స్‌, విద్యుత్‌, ర్యాంప్‌ తదితర సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఓటర్లు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఓటర్‌ జాబితా సిద్ధం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఆర్‌, తహశీల్దార్‌ వెంకటలక్ష్మి, సూపర్వైజర్‌, సంబంధిత బిఎల్వోలు పాల్గొన్నారు.

➡️