జిల్లాలో కొనసాగనున్న వీక్షిత్‌ భారత్‌ సంకల్ప్‌యాత్రనేడు 8 పంచాయతీల్లో ప్రారంభం

Nov 27,2023 21:56
జిల్లాలో కొనసాగనున్న వీక్షిత్‌ భారత్‌ సంకల్ప్‌యాత్రనేడు 8 పంచాయతీల్లో ప్రారంభం

గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేస్తున్న జెడ్‌పి సీఈవో ప్రభాకర్‌ రెడ్డిప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో వీక్షిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా 8 పంచాయతీలలో నిర్వహించారు. సోమవారం నుండి 6 ప్రచార వాహనాలతో 60 రోజులు పాటు ఈ కార్యక్రమ నిర్వహణ జరిగేలా జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌ సంబంధింత జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించడానికి వీక్షిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర కార్యకార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమ నిర్వహణకు జిల్లాస్థాయి నోడల్‌ అధికారిగా జెడ్పి సీఈఓ వ్యవహరిస్తుండగా ఆరు ప్రచార వాహనాలు జిల్లాకు కేటాయించగా 60రోజుల పాటు 694 పంచాయతీలలో ప్రచార కార్యక్రమ నిర్వహణ జరుగుతోంది. ఒక్కో వాహనం ప్రతిరోజు రెండు పంచాయతీల్లో డిజిటల్‌ స్క్రీన్‌లో వీడియోల ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం జరుగుతుంది. పుంగనూరు నియోజక వర్గం పులిచెర్ల మండలం ఏళ్ళంకివారిపల్లిలో కార్యక్రమ నోడల్‌ అధికారి ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 17 సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.

➡️