దోచుకున్నోళ్లకు దోచుకున్నంత

Nov 27,2023 22:03
దోచుకున్నోళ్లకు దోచుకున్నంత

ఉపాధి పనులపై అవినీతి ఆరోపణలు నేతల సిఫార్సుతో విరివిగా మస్టర్లుప్రజాశక్తి-గుడుపల్లి: జాబ్‌కార్డుకు వంద రోజుల పని కల్పించి నిరు పేదలను ఆదుకోవాలన్నదే ఉపాధి హామి పథకం ముఖ్య ఉద్దేశం. అడ్డదారులు ఎంచుకొన్న సిబ్బం దికి అక్రమార్కులు తోడై అంది నకాడికి దోచేస్తున్నారు. గుడుపల్లి మండలంలో నిర్వహిస్తున్న ఉపా ధిహామీ పనుల్లో అక్రమాలు జరు గుతున్నాయని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూలీలకు కల్పించే పనుల్లో 70శాతం వరకు మాత్రమే బిల్లులు చెల్లించి, మిగ లా సొమ్మును నేతల సిఫార్సుతో మరొకరి పేరిట అదే వర్క్‌ ఐడితో బిల్లులు మంజూరవుతున్నట్లు స మాచారం. లబ్ధిదారులకు పని కల్పించకుండా పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. నిత్యం ఉపా ధిహామీ కార్యాలయం చుట్టూ అక్ర మా ర్కులు చేరి సిబ్బందికి కమీ షన్‌ ఎరచూపి దోచేస్తున్నట్లు రైతు లు మండిపడుతున్నారు. అవినీతి, అక్రమాలపై విమర్శల నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించి చర్య లు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

➡️