రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Nov 27,2023 22:04
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

ప్రజాశక్తి-వికోట: వికోట-పలమనే జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. బైరెడ్డిపల్లి మండలం లక్కనపల్లికి చెందిన బాలాజి(26) కొబ్బరికాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం పనులు ముగించుకొని ద్విచక్ర వాహనంలో స్వగ్రామానికి వస్తుండగా దొడ్డిపల్లి సమీపంలో ప్రమాదవశాత్తు ఎదురుగా వస్తున్న కారు ఢకొీనింది. దీంతో బాలాజి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. వికోట సీఐ లింగప్ప కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

➡️