ఃసంక్షేమంః కొనసాగేలా దీవించండిఓటుతో ఃకూటమిఃకి బుద్ధి చెప్పండి పలమనేరు రోడ్డుషోలో సిఎం జగన్మోహన్‌రెడ్

ఃసంక్షేమంః కొనసాగేలా దీవించండిఓటుతో ఃకూటమిఃకి బుద్ధి చెప్పండి పలమనేరు రోడ్డుషోలో సిఎం జగన్మోహన్‌రెడ్డిప్రజావక్తి – వి.కోట/పలమనేరు (చిత్తూరు జిల్లా) రాబోవు ఎన్నికల కురుక్షేత్ర మహాసంగ్రామం రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ను నిర్ణయించేదని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. పేదవాని భవిష్యత్‌ బాగుపడాలంటే, మరలా రెండు బటన్లు ఫ్యాను గుర్తుపై నొక్కి పలమనేరు ఎంఎల్‌ఎగా వెంకటేగౌడను, చిత్తూరు పార్లమెంట్‌ సభ్యులుగా రెడ్డెప్పను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ దఫా అభివృద్ధికి అడ్డు పడుతున్న ప్రతిపక్షం లేకుండా 175కు 175, 25కు 25 స్థానాలు అందించి దీవించాలన్నారు. శనివారం పలమనేరులో ఎన్నికల ప్రచారంలో భాగంగా సిఎం జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ రాబోవు ఐదేళ్లలో ప్రతి పేదవాడి భవిష్యత్‌ బాగుపడాలన్నా, సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగాలన్నా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ఆదరించాలని పిలుపునిచ్చారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని అభివృద్ధి, సంక్షేమం పారదర్శకంగా అమలు చేశామన్నారు. మధ్యవర్తులు అవసరం లేని, లంచాలకు తావులేకుండా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేసి ప్రజారంజక పాలన అందించామన్నారు. మేనిఫెస్టోను ఓ బైబిల్‌, భగవద్గీత, ఖురాన్‌గా భావించి అమలు చేస్తున్నామన్నారు. చంద్రబాబుకు అధికారం దక్కితే అబద్దాలు, మోసాలు, మాయలతో సంక్షేమ పథకాలకు ముగింపు పలకడంతో చంద్రముఖి మళ్లి నిద్ర లేస్తుందన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు పేరు చెబితే ఏ పథకమైనా రాష్ట్రంలో గుర్తుకు వస్తుందా? అని ప్రశ్నించారు. తమ పాలనలో గ్రామాల్లో దాదాపు 600 రకాల సేవలను గ్రామ సచివాలయాల్లో అందుబాటులోకి తీసుకొచ్చామని, వలంటీర్ల ద్వారా నేరుగా లబ్దిదారుల ఇంటికే పారదర్శకంగా సేవలందిస్తున్నామన్నారు. సూపర్‌సిక్స్‌ పథకాలతో అమలు కాని హామీలు ప్రకటిస్తూ మరలా ప్రజలను మోసగించేందుకు కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్నాయని, ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సభలో జడ్‌పి ఛైర్మన్‌ శ్రీనివాసులు పాల్గొన్నారు.

➡️