మండే ఎండలు… కాలే కడుపులు..!ఏటేటా తగ్గుతున్న ఉపాధి పనుల ‘బడ్జెట్‌’గత ఆరేళ్లుగా నీడా, నీరూ కరువేసమ్మర్‌ అలవెన్సులు ఎత్తేసిన కేంద్రంరెండుపూట్ల మస్టర్‌ వద్దంటున్న కూలీలు ఆర్థిక సంవత్సరం ఉపాధి పనుల కల్పన (రూ.)2020-21లో రూ.13 కోట్ల 39 లక్షలు2021-22లో రూ.10 కోట్ల 97 లక్షలు2022-23లో రూ.9 కోట్ల 58 లక్షలు2023-24లో రూ.8 కోట్ల 73 లక్షలు

మండే ఎండలు... కాలే కడుపులు..!ఏటేటా తగ్గుతున్న ఉపాధి పనుల 'బడ్జెట్‌'గత ఆరేళ్లుగా నీడా, నీరూ కరువేసమ్మర్‌ అలవెన్సులు ఎత్తేసిన కేంద్రంరెండుపూట్ల మస్టర్‌ వద్దంటున్న కూలీలు ఆర్థిక సంవత్సరం ఉపాధి పనుల కల్పన (రూ.)2020-21లో రూ.13 కోట్ల 39 లక్షలు2021-22లో రూ.10 కోట్ల 97 లక్షలు2022-23లో రూ.9 కోట్ల 58 లక్షలు2023-24లో రూ.8 కోట్ల 73 లక్షలు

మండే ఎండలు… కాలే కడుపులు..!ఏటేటా తగ్గుతున్న ఉపాధి పనుల ‘బడ్జెట్‌’గత ఆరేళ్లుగా నీడా, నీరూ కరువేసమ్మర్‌ అలవెన్సులు ఎత్తేసిన కేంద్రంరెండుపూట్ల మస్టర్‌ వద్దంటున్న కూలీలు ఆర్థిక సంవత్సరం ఉపాధి పనుల కల్పన (రూ.)2020-21లో రూ.13 కోట్ల 39 లక్షలు2021-22లో రూ.10 కోట్ల 97 లక్షలు2022-23లో రూ.9 కోట్ల 58 లక్షలు2023-24లో రూ.8 కోట్ల 73 లక్షలుప్రజాశక్తి-తొట్టంబేడు గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలకు ఏడాదికి వంద రోజుల పని కల్పించడం ద్వారా సామాజిక, ఆహారభద్రతను పెంపొందించాలన్న గొప్ప సంకల్పం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానిది. ఆనాడు వామపక్ష పార్టీలు చేపట్టిన ఉద్యమాల ఫలితంతగా 2005లో ఈ పథకం పురుడు పోసుకుంది. అయితే ఈ పథకాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం క్రమక్రమంగా నీరుగారుస్తోంది. ఉపాధి కూలీలు తెల్లారే వచ్చి ఉదయం 10 గంటకల్లా వెళ్లిపోయే వెసులుబాటు ఉన్నా రెండు పూటలా మస్టర్‌ పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. ఉపాధి పనులు జరిగే చోట కనీసం నీడ, నీరు, ప్రథమ చికిత్స పెట్టె ఎక్కడా అందుబాటులో ఉండటం లేదు. వేసవిలో ఉపాధి కూలీలకు అందాల్సిన 30శాతం అలవెన్స్‌నూ కేంద్రం కోత పెట్టింది. పార, గడ్డపార, తట్ట, బుట్టకిచ్చే అదనపు కూలికి ఎసరు పెట్టింది. మండే ఎండల్లో కాలే కడుపులతో కూలీలు దయనీయంగా ఉపాధి పనులు చేస్తుండటం ‘ప్రజాశక్తి’ పరిశీలనలో కనిపించింది. తొట్టంబేడు మండలంలో 8,762 జాబ్‌కార్డులున్నాయి. వీరిలో 50 శాతం మాత్రమే ఉపాధి పనులకు వెళుతున్నారు. అయితే మండు వేసవిలో పని ప్రదేశాల్లో నీడ, నీరు, ప్రథమ చికిత్స పెట్టె ఎక్కడా కానరాని పరిస్థితి. గత ఆరేళ్లుగా ఇవ్వడం లేదని ఉపాధి కూలీలు వాపోయారు. సాధారణంగా ఉపాధి హామీ పనుల్లో నీటి వనరులు, భూసార, పర్యావరణ పరిరక్షణ, కరువు నివారణ, వరద నియంత్రణ, అడవులు, చెట్ల పెంపకంతో పాటు ఇతర గ్రామీణాభివృద్ధి పనులను పెద్ద ఎత్తున చేస్తుంటారు. ఇవన్నీ అత్యంత కష్టంతో కూడుకున్న పనులు. ఈ పరిస్థితుల్లో ఉపాధి కూలీలు రెండు పూట్ల పని చేస్తేనే హాజరు వేస్తామంటూ కేంద్రం చెప్పడం విమర్శలకు దారి తీస్తోంది. ఉదయం 9 గంటలకే ఎండలు సుర్రుమని, చేతులు, కాళ్ళు బొబ్బలెక్కుతున్నాయనీ, మళ్ళీ మధ్యాహ్నమూ పని చేయమంటే ప్రాణాలపైకి తెచ్చుకోవడమేనని కూలీలు వాపోతున్నారు. గత వారం రోజులుగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎండ తీవ్రత ఎక్కువైంది 42 నుంచి 44 డిగ్రీల వరకు ఎండ కాస్తుంది. ఎండకు ఎండుతూ ..గొంతు ఎండుతున్న నీళ్లు లేక వడదెబ్బ సోకుతుందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు జరిగే ప్రదేశం నుంచి గ్రామానికి దూరం కావడంతో నీళ్లు తెచ్చుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. బిల్లుల చెల్లింపులో జాప్యంగతంలో టీసీఎల్‌ ద్వారా రాష్ట్రం బిల్లులు చెల్లిస్తుండగా, ఇప్పుడు కేంద్రం జాతీయ మొబైల్‌ పర్యవేక్షక వ్యవస్థ (ఎన్‌ఎంఎంఎస్‌) కింద రోజువారీగా కూలీల వివరాలను నమోదు చేస్తూ ఎన్‌ఐసీ ద్వారా చెల్లింపులు చేస్తోంది. ఫలితంగా బిల్లులో జాప్యం జరుగుతోందంటూ ఉపాధి హామీ అధికారులే చెబుతుండడం గమనార్హం. సమ్మర్‌ లో ఉపాధి బిల్లులలో జాప్యం ఉండదని, రెండు వారాలకు ఒకసారి బిల్లులు పడుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రామచంద్రపురం గ్రామంలో మస్తానమ్మ గ్రూపులో 15 మందిని పనులకు పిలిపించి నెల రోజులు పనులు చేయించుకుని బిల్లులను గతంలో ఉన్న క్షేత్ర సహాయకుడు చెల్లించలేదు. ఆ బిల్లులు చెల్లించకపోవడంలో ఆంతర్యం ఏమిటని, ఆ బిల్లులు ఏమయ్యాయని పలువురు చర్చించుకుంటున్నారు. ఇది జరిగి రెండు సంవత్సరాల గడుస్తున్నా ఏ అధికారీ పట్టించుకోకపోవడం శోచనీయం. శుక్రవారం తొట్టంబేడు పంచాయతీలోని రామచంద్రపురం గ్రామంలోని కచ్చేలగుంట చెరువులో ఉపాధి పనులను పరిశీలించగా కూలీలకు గిట్టుబాటు కూలి కల్పించలేదని వారు ‘ప్రజాశక్తి’కి మొరపెట్టుకున్నారు.మండలంలో క్షేత్ర సహాయకుల కొరతతొట్టంబేడు మండలంలో 27 పంచాయితీలు ఉన్నాయి. అయితే ప్రధాన నాయకుని కనుసన్నల్లో ఈ ఉపాధి క్షేత్ర సహాయకులు పనిచేయాలి. వారి మాట వినకుంటే నిర్మొహమాటంగా తొలగిస్తారు. అందులో భాగంగా తొట్టంబేడు మండలంలో సుమారు 15 మందిని తొలగించారు. వారికి అనుకూలమైన వారిని విధుల్లో చేర్పించుకున్నారు. అయినప్పటికీ 12 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు మండలంలో కొరతగా ఉంది . ఈ నాయకుల వల్ల ఉపాధి పనులకు వెళ్లాలంటే ఫీల్డ్‌ అసిస్టెంట్లు లేని పరిస్థితి మండలంలో నెలకొంది. ఉన్నతాధికారులు గుర్తించి ఉపాధి క్షేత్ర సహాయకులను భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఉపాధి పనులే ఆధారం : ఆదెమ్మతొట్టంబేడు పంచాయతీ రామచంద్రాపురం గ్రామం. రెండేళ్ల క్రితం ఉపాధి పనులకు వెళ్లాను. అయితే అప్పట్లో ఉన్న క్షేత్ర సహాయకుడు నాలుగు వారాలు పని చేయించుకుని ఒక్క రూపాయి కూడా బిల్లు చెల్లించలేదు. అప్పటి నుంచి ఉపాధి పనులపై నమ్మకం పోయింది. ప్రస్తుతం ఉన్న ఫీల్డ్‌ అసిస్టెంట్‌ సర్ది చెప్పడంతో పనులకు వస్తున్నాను. కాలే కడుపులతో పనులకు వెళ్లాం : బుజ్జమ్మ మేం గిరిజనులం. ఉపాధి పనులకు వెళితే ఒక్కసారిగా డబ్బు వస్తుంది. ఇంటిలో సరుకులు తెచ్చుకోడానికి ఉపయోగ పడుతుందని వెళ్లేవాళ్లం. అయితే రెండేళ్ల క్రితం నెలరోజులు పనులు చేయించుకుని బిల్లులు ఇవ్వలేదు. పస్తులుండి పనులకు వెళ్లాం. పనులకు వెళ్లినా పస్తులుండాల్సి వచ్చింది. ఎండకు తట్టుకోలేకున్నాం : నిర్మల ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. తట్టుకోలేకున్నాం. పనులకు రాకపోతే పస్తుండాలి. చెమటలు కక్కుకుంటూ తట్టలు మోస్తున్నాం. ఇంటికి వెళ్లే సరికి నీరసం వస్తోంది. మాకు రూ.400 వచ్చేలా గిట్టుబాటు కూలి కల్పించాలి. ప్రస్తుతం ఇస్తామని చెబుతున్న 300 కూలీ మా ఖాతాల్లో జమ కాలేదు. గిట్టుబాటు కూలి కల్పించండి : సుబ్రహ్మణ్యం ఐదేళ్ల క్రితం వరకూ గడ్డపారకు, నీళ్లకు అదనంగా కూలి వచ్చేది. ప్రస్తుతం అవన్నీ రావట్లేదు. నిత్యావసర సరుకుల రేట్లు పెరిగిపోతున్నాయి. రూ.300 కూలి వస్తుంది అంటున్నారు. అది సరిపోదు. కనీసం రూ.500 ఇచ్చేలా చూడాలి. గడ్డ పారవేస్తే ఎండలకు చేతులు బొబ్బలెక్కుతున్నాయి. గిట్టుబాటు కూలి వచ్చేలా చూడాలి. కనీస సౌకర్యాలు కల్పించాలి: పెనగడం గురవయ్య, సిపిఎంఉపాధి పనులు జరిగే చోట కనీస వసతులు లేవు. బడ్జెట్‌లో నిధులకు కేంద్రం కోత పెట్టింది. వంద రోజులు పూర్తయిన కుటుంబాలకు పనులు కల్పించడం లేదు. చేసిన వారికి బిల్లులు చెల్లించడం లేదు. సమ్మర్‌ అలావెన్స్‌ పూర్తిగా ఆపేసింది. కూలీలకు సమ్మర్‌ అలవెన్స్‌ 40 శాతం ఇవ్వాలి.

➡️