మిట్టగాంధీపురంలో భూ వివాదం

మిట్టగాంధీపురంలో భూ వివాదం

మిట్టగాంధీపురంలో భూ వివాదం ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)మంగళం పరిధిలోని న్యూ మంగళం పంచాయతీలోని మిట్టగాంధీపురం వద్ద భూ వివాదం చోటుచేసుకుంది. ఈ వివాదం మాటలతో మొదలై ఘర్షణకు దారి తీసింది. ఈ వర్షంలో మిట్టగాంధీపురానికి చెందిన 15 మంది గ్రామస్తులు గాయపడి తిరుపతి రూయా ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లారు. గ్రామస్తులు అశోక్‌, చంద్రబాబు సమాచారం మేరకు… 1981లో మిట్టగాంధీపురం గ్రామ పరిధిలోని మంగళం గ్రామ లెక్క దాఖలా సర్వే నంబర్‌ 78లోని 2బి1, 2బి4లో గల కాలువపోరంబోకు, అనాదీనం భూమి ఎకరా స్థలం ఉంది. గ్రామస్తుల విన్నపం మేరకు ఈ భూమిని గ్రామస్తులే అనుభవించుకొనేల అప్పటి అధికారులు పట్టాలను మంజూరు చేశారు. ఇన్నాళ్ళుగా ఈ భూమి ఖాళీగానే ఉంది. దీన్ని గమనించిన కొందరు కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. శనివారం సదరు భూమిని పట్టాలు కలిగి ఉన్నామని సామాజిక మీడియా వ్యక్తిగా చెప్పబడే హేమాద్రి అనే వ్యక్తి, మంగళం అంబేద్కర్‌ కాలనీకి చెందిన నిర్మల, ఆమె తమ్ముడు శీను మరి కొంతమంది కలిసి జెసిబితో భూమిని చదును చేయడానికి ప్రయత్నం చేశారన్నారు. దీనిని గమనించిన గ్రామస్తులం అందరం కలిసి వారి ప్రయత్నాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా వారు భౌతిక దాడులకు తెగబడి గ్రామస్తుల్లో 15 మందిని గాయపరచారన్నారు. ప్రథమ చికిత్స నిమిత్తం తిరుపతి రుయా హాస్పిటల్‌ కు వచ్చామన్నారు. ఈ ఘటనపై పోలీసు వారికి ఫిర్యాదు చేస్తున్నామన్నారు.

➡️