మేకల మందపై పిడుగు 16 మేకలు మృతినేలరాలిన మామిడిపిందెలువిద్యుత్‌ సరఫరాకు అంతరాయం

మేకల మందపై పిడుగు 16 మేకలు మృతినేలరాలిన మామిడిపిందెలువిద్యుత్‌ సరఫరాకు అంతరాయంప్రజాశక్తి – వి.కోట , రామచంద్రాపురంతిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన గాలీవాన గత మూడు రోజులుగా కురుస్తోంది. తిరుమల తిరుపతిలో మధ్యాహ్నం గంటపాటు వర్షం పడింది. దీంతో ఉక్కపోతతో అల్లాడిపోతున్న జనం ఉపశమనం పొందారు. గత రెండు రోజుల వర్షానికి మామిడి కాయలు రాలిపోయాయి. అరటిచెట్లు కూలిపోయాయి. శనివారం వి.కోట మండలంలో మేకల మందపై పిడుగు పడి 16 మేకలు మృత్యువాత పడ్డాయి. బోయచిన్నాగనపల్లి గ్రామపంచాయతీ రామ నాథపురం గ్రామానికి చెందిన రైతు శంకరప్ప మేకల పోషణ ద్వారా జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలాగే నాయకనేరి అటవీ ప్రాంతంలోకి మేత కోసం మేకల మందను తోలుకెళ్లారు. మధ్యాహ్నం సుమారు మూడున్నర గంటలకు వర్షంతో పాటు భారీ ఉరుములు సంభవించాయి. నాయకనేరి దుర్గం అటవీ ప్రాంతం వద్ద చౌడేశ్వరి గుడి వద్ద తలదాచుకుంటున్న మేకల మందపై పిడుగు పడింది. మేకలు మత్యువాత పడ్డాయి. పెంపకదారు శంకరప్ప ఘాతానికి గురై స్పహతప్పి పడిపోయాడు. కొంత సమయం తర్వాత తేరుకొని విషయాన్ని గ్రామస్తులకు చేరవేశారు. గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకునీ బాధితుని ఆసుపత్రికి తరలించారు. జీవాల పోషణతో బతుకుతున్న శంకరప్ప మేకల మంద పిడుగుపాటుకు బలవడంతో జీవనం కోల్పోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 2 లక్షలకు పైగా నష్టపోయినట్లు పెంపకదారు తెలిపారు. ప్రభుత్వం బాధితునికి పరిహారం ఇచ్చి ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.ఆర్‌సిపురంలో గాలివాన బీభత్సం మండలంలో ఉరుములు మెరుపులు, గాలివాన బీభత్సం సష్టించడంతో నడవలూరు సబ్‌స్టేషన్‌లోని విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. నాలుగు గంటల పాటు విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. శనివారం సాయంత్రం మూడు గంటలకు ఎండ తీవ్రత తగ్గి ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. అనంతరం ఉరుములు మెరుపులు పెనుగాలులతో ఓ మోస్తారు వర్షం కురిసింది. ట్రాన్స్‌కో అధికారులు యుద్ధప్రాతిపదికన విద్యుత్‌ స్తంభాలనుఏర్పాటు చేసి విద్యుత్‌ లైన్లు లాగుతున్నారు. మామిడి పంట అంతంత మాత్రంగానే ఈ సీజన్‌లో ఉంది. అయితే ఈ గాలులకు పిందెలు రాలిపోవడంతో మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.

➡️