వేములవలస మార్కెట్‌ రూ.1.27 కోట్లకు వేలం

Jun 30,2024 00:45 #Vemulavalasa Market velam
Vemulavalasa Market velam

 ప్రజాశక్తి-ఆనందపురం: ఆనందపురం మండలం వేములవలస డైలీ మార్కెట్‌ను రూ. ఒక కోటీ 27 లక్షలా 998కి ఎన్ని శంకర్రావు వేలంలో సొంతం చేసుకున్నారు. జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యాన గ్రామ పంచాయతీ విస్తరణ అధికారి రామారావు అధ్యక్షతన వేములవలస వేలంపాట శనివారం మధ్యాహ్నం నిర్వహించారు. గత ఏడాది 12 నెలలకు గానూ రూ.1.54 కోట్లకు పతివాడ పుష్పవతి వేలం పాడి ఆశీలు వసూలు చేసుకున్నారు. ఈ ఏడాది తొమ్మిది నెలల కాలాన్ని నిర్ణయిస్తూ వేలంపాట నిర్వహించారు. ఈ వేలం పాటలో కోరాడ శ్రీనివాసరావు, ఎన్ని శంకరరావు, కోరాడ మహేష్‌, పతివాడ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. బహిరంగ వేలంలో పాటలో రూ.1.07 కోట్లకు కోరాడ శ్రీనివాసరావు హెచ్చు పాటదారుడుగా నిలిచాడు. అనంతరం సీల్డ్‌ కవర్లను ఓపెన్‌ చేయగా అందులో ఎన్ని శంకరరావు రూ.కోటీ 27 లక్షలా 998కి హెచ్చు కొటేషన్‌ వేయడంతో శంకరరావును హెచ్చు పాటదారుడుగా నిర్ణయిస్తూ వేలంపాటను ముగించారు. జులై 1వ తేదీ నుంచి 31 మార్చి 2025 వరకు వేములవలస డైలీ మార్కెట్‌ ఆసీలు వసూలు చేసుకునే వెసులుబాటును కల్పిస్తూ అధికారులు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో వేములవలస గ్రామ కార్యదర్శి నర్సింగరావు, శ్రీరామ్మూర్తి, స్థానిక సర్పంచ్‌ లంక కొండమ్మ, ఉపసర్పంచ్‌ నవీన్‌ జ్ఞానేశ్వరరావు పాల్గొన్నారు

➡️