నేడు గాన కోకిల రాక

Mar 31,2024 21:18

ప్రజాశక్తి-విజయనగరం కోట : విజయనగరం వాసి, గానకోకిల పి.సుశీల సోమవారం జిల్లాకు రానున్నారు. నగరానికి చెందిన శ్రీ గురు నారాయణ కళాపీఠం తృతీయ వార్షికోత్సవం సందర్భంగా వారు అందిస్తున్న పరిపూర్ణ జీవిత సాఫల్య పురస్కారానికి ఆమె ఎంపిక అయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆనంద గజపతి ఆడిటోరియంలో జరిగే కార్య్రమంలో ఆమె ఈ అవార్డును అందుకోనున్నారు. 90 ఏళ్ల వయసులో ఆమె స్వస్థలానికి రాబోతున్నారు. ఇంతకుముందు ఆమె 2019లో జరిగిన మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల వందేళ్ల ఉత్సవానికి హాజరయ్యారు. ఆమెతోపాటు సినీ సంగీత దర్శకులు మణిశర్మ రానున్నారు.

➡️