బాలికలదే పైచేయి

Apr 12,2024 21:40

ఎప్పటిలాగే ఈఏడాది కూడా పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో బాలికలదే పైచేయి అయ్యింది. విజయనగరం జిల్లా ప్రథమ ఇంటర్‌లో రాష్ట్రంలో 13వ స్థానం, ద్వితీయ ఇంటర్‌లో 21వ స్థానంలో నిలిచింది. పార్వతీపురం మన్యం జిల్లా ప్రథమ, ద్వితీయ ఇంటర్‌లోనూ 11వ స్థానం సాధించింది. ఒకేషనల్‌ కోర్సు ఫలితాల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం గమనార్హం.

విజయనగరం టౌన్‌/పార్వతీపురంరూరల్‌ : విజయనగరం జిల్లా నుంచి ప్రథమ ఇంటర్‌లో జనరల్‌ విద్యార్థులు మొత్తం 16584 మంది పరీక్షకు హాజరు కాగా వారిలో 10267మంది ఉత్తీర్ణులై 62శాతం ఫలితాలు నమోదు చేశారు. ఒకేషనల్‌ విద్యార్థులు 2909 మంది హాజరు కాగా 1678మంది ఉత్తీర్ణులై 58శాతం ఫలితాలు నమోదు చేశారు. ద్వితీయ ఇంటర్‌లో జనరల్‌ విద్యార్థులు 15189 మంది హాజరు కాగా 10,591 మంది ఉత్తీర్ణులై 70శాతం ఫలితాలు నమోదు చేశారు. ఒకేషనల్‌ విద్యార్థులు ప్రథమ ఇంటర్‌లో 2909 మందికి గాను 1679 మంది ఉత్తీర్ణులై 58స్థానంలో నిలవగా, రెండో ఏడాది 2693 మంది హాజరు కాగా వారిలో 1824మంది ఉత్తీర్ణులై 68శాతం ఫలితాలు నమోదు చేశారు. ప్రథమ ఇంటర్‌లో మొత్తం విద్యార్థుల్లో బాలికలు 8903 మందిలో 6033మంది ఉత్తీర్ణులై 68శాతం, బాలురులో 7681 మందికి 4234 శాతం ఉత్తీర్ణులై 55శాతం ఫలితాలు సాధించారు. ద్వితీయ ఇంటర్‌లో మొత్తం బాలురు 6783మంది హాజరు కాగా వారిలో 4377మంది ఉత్తీర్ణులై 64శాతం, బాలికలు 8387మందికి 6214 మంది ఉత్తీర్ణులై 74శాతం ఫలితాలు నమోదు చేశారు. గత ఏడాదితో పోల్చితే ఫలితాల్లో కొంత మెరుగుదల కనిపించింది.100 శాతం ఫలితాల్లో బాడంగి కెజిబివి జిల్లాలోని కెజిబివి బాడంగి కళాశాల ప్రథమ, ఇంటర్‌లో వందశాతం ఫలితాలు సాధించింది. రెండో స్థానం 96.67 శాతంతో ఎల్‌ కోట కెజిబివి కళాశాల నిలిచింది. 93.94 శాతంతో రామచంద్రపురం, నెల్లిమర్ల 90.48 శాతంతో మూడో స్థానంలో ఉన్నాయి. సోషల్‌ వెల్ఫేర్‌ కాలేజీల్లో వేపాడ, బాడంగి కళాశాలలు వందశాతం ఫలితాలు సాధించాయి.పార్వతీపురం మన్యం 11వ స్థానం పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రథమ ఇంటర్‌లో 5475 మంది విద్యార్థులకు గాను 3565 మంది ఉత్తీర్ణత సాధించి 65శాతం నమోదు చేశారు. ద్వితీయ ఇంటర్‌లో 5292 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 4054 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా 77శాతంతో 11వ స్థానంలో నిలిచింది. జిల్లాలో కొమరాడ ప్రభుత్వ కళాశాల ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రథమ ఇంటర్‌లో బాలురు 59శాతం, బాలికలు 70శాతం, ద్వితీయ ఇంటర్‌లో బాలురు 73శాతం, బాలికలు 80శాతం ఫలితాలు సాధించారు. జిల్లాలోని 14 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మొదటి సంవత్సరం (జనరల్‌) 1761 మంది విద్యార్థులు హాజరుకాగా 934 మంది విద్యార్థులు, రెండో ఏడాది (జనరల్‌) 1717 మంది విద్యార్థులు హాజరు కాగా 1169 మంది ఉత్తీర్ణులయ్యారు.ప్రథమ ఇంటర్‌లో 96 శాతం, ద్వితీయ ఇంటర్‌లో 98శాతం ఉత్తీర్ణతతో కొమరాడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రథమ స్థానంలో నిలిచిందని వృత్తివిద్యా అధికారి మంజులవీణ తెలిపారు. మక్కువ ప్రభుత్వ కళాశాల ప్రథమ ఇంటర్‌లో 93శాతం, ద్వితీయ ఇంటర్‌లో 95శాతంతో జిల్లాలో రెండోస్థానంలో నిలిచాయని తెలిపారు. కొమరాడ, గరుగుబిల్లి సోషల్‌ వెల్ఫేర్‌ కళాశాలల విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించారు. సీతంపేట మండలం మల్లి ఎపిటిడబ్ల్యూఆర్‌ కళాశాల ప్రథమ స్థానంలో, ద్వితీయ ఇంటర్‌లో సీతంపేట (గర్ల్స్‌) మల్లి, జోగింపేట, కురుపాం, భద్రగిరి (గర్ల్స్‌) విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో మక్కువ, గరుగుబిల్లి కెజిబివి కళాశాలలు, ద్వితీయ సంవత్సరంలో మక్కువ, గరుగుబిల్లి, జోగింపేట కురుపాం, చినమేరంగి కాలేజీ విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించారు. మోడల్‌ కాలేజ్‌ విభాగంలో మక్కువ కాలేజీ ప్రథమ సంవత్సరం 98శాతం, ద్వితీయ సంవత్సరం వందశాతం ఫలితాలు సాధించింది.ఒకేషనల్‌లో ప్రథమ స్థానంఒకేషనల్‌ ఫలితాల్లో మన్యం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.మొదటి సంవత్సరం 2736 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 2104 మంది ఉతీర్ణులై 77శాతం ఫలితాలు నమోదు చేశారు. ద్వితీయ సంవత్సరం 2447 మంది విద్యార్థులకు గాను 2034 మంది ఉత్తీర్ణులై 83శాతం ఫలితాలు నమోదు చేశారు. మోడల్‌ స్కూల్స్‌లో ..ప్రథమ ఇంటర్లో వేపాడ 99.16 శాతం, పెరుమాలి 90.12 శాతం, నెల్లిమర్ల 87.36 శాతంతో వరుస మూడు స్థానాల్లో నిలిచాయి. ద్వితీయ ఇంటర్లో పెరుమాలి 94.90శాతం, వేపాడ 94.67శాతం, ఎల్‌.కోట 93.75శాతం సాధించి మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.ప్రభుత్వ కళాశాలల ఫలితాలు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ద్వితీయ ఇంటర్‌లో బాడంగి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల 93.62 శాతం, వేపాడ కళాశాల 83.08 శాతం, డెంకాడ జూనియర్‌ కళాశాల 74.19 శాతం ఫలితాలు సాధించాయి. ప్రథమ ఇంటర్‌లో దత్తిరాజేరు 100శాతం, బాడంగి 74.51 శాతం, వేపాడ జూనియర్‌ కళాశాల 62 శాతం ఫలితాలు సాధించాయి. దత్తిరాజేరు మండలంలో ఒక్క విద్యార్థి మాత్రమే హాజరు కాగా ఆ విద్యార్థి ఉత్తీర్ణుడై వందశాతం ఉతీర్ణత సాధించాడు.

➡️