వేసవి శిబిరాలు వినోదాల సందళ్లు..

Jun 30,2024 10:24 #chirumuvallu, #Sneha

హేలాపురి చిల్డ్రన్స్‌ క్లబ్‌ (హెచ్‌సిసి)- ఏలూరు పరిధిలో ఈ ఏడాది వేసవి వినోద శిబిరాలు మొత్తం 21 ప్రాంతాలలో ఏప్రిల్‌ 28 నుండి జూన్‌ 12 వరకు నిర్వహించారు. ఈ వేసవి వినోద శిబిరాలలో మొత్తం వెయ్యిమందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తెలుగు భాషాంశాలు, స్పోకెన్‌ ఇంగ్లీష్‌, గణితం, శాస్త్రీయ తదితర విద్యా సంబంధిత అంశాలు నేర్పించారు. వీటితో పాటు చిత్ర లేఖనం, డాన్స్‌, ప్రొజెక్టర్‌ సహాయంతో స్వాతంత్య్ర సమరయోధుల జీవిత చరిత్రలు నేర్చుకున్నారు. జంక్‌ ఫుడ్స్‌ తినడం వలన కలిగే అనారోగ్య సమస్యలపై అవగాహన కలిగించారు. విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు. మెమొరీ గేమ్స్‌, పేపర్‌ సహాయంతో గృహ అలంకరణ వస్తువులు, పర్యావరణ పరిరక్షణ అంశాలను నేర్పించారు. విద్యార్థులకు పాతకాలం ఆటలు వంగుళ్లు – దూకుడు, గుడు గుడు గుంచం ,కాళ్ల గజ్జ కంకాళమ్మ ఆడించారు. అలాగే ఖో ఖో, కబడ్డీ, బ్యాట్మెంటన్‌, క్రికెట్‌ వంటి ఆటలను నేర్పించారు. రకరకాల వాయిద్యాలపై అవగాహన కలిగించి, వాటిని నేర్పించారు. సెల్ఫ్‌ డిఫెన్స్‌కి సంబంధించి విద్యార్థులకు కర్రసాము, కుంగ్ఫూ, కరాటే మొదలైనటువంటి అంశాలు నేర్పించారు. గుడ్‌ హ్యాబిట్స్‌ అంశాలను నేర్పించారు. అలాగే విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రత్యేక ఆటలను ఆడించారు. వారితో చిత్రాలను గీయించారు. వారికి సేవ చేయడం వంటి విషయాలను పిల్లలకు అవగాహన కల్పించారు. హేలాపురి చిల్డ్రన్స్‌ క్లబ్‌ కార్యక్రమాల్ని ఆయా ప్రాంతాలలో పిల్లల తల్లిదండ్రులు, చుట్టుపక్కల ప్రజలు బాగా ఆదరించారు. విద్యార్థులలో విజ్ఞానం, వినోదం, వికాసానికి ఈ వేసవిలో శిబిరాలు ఎంతగానో తోడ్పడ్డాయి.

పాశల దుర్గాప్రసాద్‌
సెక్రటరీ – హేలాపురి చిల్డ్రన్స్‌ క్లబ్‌, ఏలూరు.
ఫోన్‌ : 569956176

➡️