కొండ్రుప్రోలును గూడెంలో కలపొద్దు

ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం రూరల్‌

కొండ్రుప్రోలు గ్రామాన్ని తాడేపల్లిగూడెం పట్టణంలో కలపొద్దని, తమ ఉపాధిని దెబ్బతీయొద్దని ఆ ప్రాంతం ఉపాధి కూలీలు డిమాండ్‌ చేశారు. సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం నేతలు కొండ్రుప్రోలు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు కూలీల సమస్యలు తెలుసుకుని మాట్లాడారు. నాలుగేళ్ల నుంచి గ్రామాన్ని మున్సిపాల్టీలో విలీనం చేయడం ద్వారా కూలీలకు ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాదే వారికి పనులు కల్పించడంతో కొంత ఆసరా వచ్చిందన్నారు. పట్టణాల్లో విలీనం చేసిన గ్రామాల్లో కూడా పూర్తిస్థాయి పనులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బుడిగిన లక్ష్మి, దిరిస్పాముల సుబ్బారావు, మర్లపూడి వీరాస్వామి, మాందాల తులసమ్మ, నెలపాల అంజయ్య, మార్లపూడి రామారావు, ఉప్పలపాటి సత్తియ్య, కొమ్ము చంటి పాల్గొన్నారు.

➡️