ఆర్‌టిసి ప్రయాణికులకు బహుమతులు

ఆర్‌టిసి డిపో గ్యారేజ్‌ ఇన్‌ఛార్జి కె.చిట్టిబాబు

ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం

ఆర్‌టిసి బస్సుల్లో ప్రయాణం చేయండి.. బహుమతులను పొందండని తాడేపల్లిగూడెం ఆర్‌టిసి డిపో గ్యారేజ్‌ ఇన్‌ఛార్జి కె.చిట్టిబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పదిహేను రోజులకు జంగారెడ్డిగూడెం, ఆచంట, గణపవరం, భీమవరం రూట్లలో ప్రయాణం చేసేవారు తమ టికెట్‌ వెనుక పేరు, మొబైల్‌ నెంబర్‌ రాసి బస్సుల్లో ఉన్న గిఫ్ట్‌ బాక్స్‌లో వేయవలెనన్నారు. ఈనెల 3వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ప్రయాణం చేసిన వారి టికెట్లు శనివారం ఉదయం 12 గంటలకు తాడేపల్లిగూడెం బస్‌ స్టేషన్‌లో ప్రయాణీకుల సమక్షంలో లక్కీ డీప్‌ నిర్వహించారు. లక్కీ డ్రా విజేతలకు బహుమతులను తాడేపల్లిగూడెం జివి.మాల్‌ వారి సౌజన్యంతో ప్రతి పదిహేను రోజులకు లక్కీ డీప్‌ ద్వారా డ్రా తీసి బహుమతులను అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎపిఎస్‌ ఆర్‌టిసి యూనియన్‌ నాయకులు రమణ, పిఆర్‌ఒ.విజయకుమార్‌, ప్రయాణికులు పాల్గొన్నారు.

➡️