ఉడుకుతున్న ఉండి

Apr 12,2024 11:33 #West Godavari District

ప్రజాశక్తి-ఉండి: తెలుగుదేశం శ్రేణుల నిరసనలతో ఉండి ఉడుకుతుంది. ఎమ్మెల్యే మంతెన రామరాజుకే ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కొనసాగించాలని ఉండి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద జిల్లా ప్రధాన కార్యదర్శి జుత్తిగ శ్రీనివాస్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు చెన్నంశెట్టి హరినాయుడు, యండగండి యూనిట్ ఇంచార్జ్ కాలా గణేష్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష శుక్రవారం మూడో రోజుకు చేరుకుంది. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ముగ్గురిలో చెన్నంశెట్టి హరి నాయుడు, కాలా గణేష్ ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా మారి బిపి తగ్గడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది వారిద్దరికీ బలవంతంగా సెలైన్ బాటిల్స్ ను అమర్చారు. వీరికి సంఘీభావంగా మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కిన్నెర వెంకన్న, నాయకులు కాగిత మహంకాళి, మంతెన సాయి లచ్చిరాజు, యర్రా చిట్టిబాబు, ముగ్గళ్ల సత్యనారాయణ, గురువెల్లి బాబురావు తదితర నాయకులు దీక్షలో కూర్చున్నారు.

➡️