వ్యాపారులకే ‘తెల్లబంగారం’

ఆకు వచ్చి ముల్లుపై పడినా.. ముల్లు వచ్చి ఆకుపై పడినా చివరకు ఆకుకే నష్టం అన్న చందంగా మారింది రైతన్నల పరిస్థితి. ముఖ్య ంగా పత్తి రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎంతో కష్టపడి పండి ంచిన పంటను అమ్ముకుని చేసిన అప్పులు తీర్చుకుందామనుకున్న రైతులు సరుకు విక్రయించే సమయంలో దగ్గా పడుతున్నారు. వారిని నట్టేట ముంచుతున్నారు. డిజిటల్‌ రిమోట్‌ కాటా దారులు. సరుకు తూకం కూడా రైతులకు చూపడం లేదు వ్యాపారు. మార్కెట్‌ ధర క్వింటా పత్తి రూ. 7,650 ఉంటే అందులోనూ రూ.650 తగ్గించి వ్యాపారులు కొనుగోలు చేయడమేగాక తేమ పేరుతో క్వింటాకు 2 నుంచి 5 కిలోల సరుకు బాగలేదని కోత విధిస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక తప్పని సరి పరిస్థితుల్లో విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడిందని పలువురు వ్యాపారులు వాపోతున్నారు.ప్రజాశక్తి-బి.కోడూరు బద్వేల్‌ తాలుకా మోత్తం మీదా పూర్తిగా వ్యవసాయపై ఆధారపడిన ప్రాంతం బి. కోడూరు ఒకటి. అసలే కరువు కాటకాలతో అల్లాడుతున్న రైతులు బోర్ల కింద అప్పు చేసి అంతో ఇంతో రబీ సీజన్‌లో మండల వ్యాప్తంగా సుమారు 350 హెక్టార్లలో పత్తిపంటను సాగు చేశారు. ఆరుగాలం కష్టపడి దక్కించుకున్న పత్తి రైతులు వ్యాపారులు, గ్రామ స్థాయి దళారుల చేతుల్లో దోపిడీకి గరవుతున్నారు. వేసవి సీజన్‌కు ముందుగా అంది వచ్చిన పత్తి పంటకు ప్రస్తుతం మార్కెట్‌ ధర రూ. 7,650 ఉంది. వ్యాపారులు, దళారులు కుమ్మక్కై క్వింటాకు రూ. 650 తగ్గిస్తూ రూ. 7 వేలకు కొనుగోలు చేస్తూ రైతులను నష్టాల్లోకి నెడుతున్నారు. పైగా తూకంలో వ్యాపారులు తెచ్చుకున్న డిజిటల్‌ రిమోట్‌ కాటాలతో కొలతలను వారి ఇష్టం వచ్చినట్లు రిమోట్‌తో కంట్రోల్‌ చేస్తూ తుకాన్ని తగ్గించి రైతులకు చూపుతున్నారు. పత్తిలో తేమ శాతం ఉందని, సరుకు బాగోలేదని సాకు చూపి క్వింటాకు 2 నుంచి 5 కిలోల వరకు తూకం తగ్గించి, ధరలో కూడా కోత విధిస్తున్నారు. ఇందుకు గ్రామస్థాయి దళారులు పూర్తి స్థాయిలో వ్యాపారులకు సహకరిస్తున్నారు. ఇటీవల శ్రీరామనమి పండుగ రోజు పంటలపై రుసుం పాట వసూళ్లతోపాటు ప్రత్యేక రిమోట్‌ కాటాపై రుసుం పాట పాడి వాటినే వినియోగించాలని రైతులను మభ్యపెట్టి మోసం చేశారు. ఈ విషయంపై రైతులు ఎవరిని అడగాలో తెలియక బోరుమంటున్నారు. మండలస్థాయి వ్యవసాయాధికారులను అడుగుతామంటే డిజిటల్‌ రిమోట్‌ కాటాలు తమ పరిధిలో లేవని జిల్లా స్థాయి తూనికల అధికారులకు ఫిర్యాదు చేసుకోవాలని సూత్రప్రాయంగా సలహాలిస్తున్నారు. ఇలా రైతులు విత్తం నాటినప్పటి నుంచి సరుకును అముకునే వరకు దగ్గా పడుతూనే ఉన్నారు. జిల్లా వ్యవసాయాధికారులు , తూనికల అధికారులు స్పదించి తూకాల్లో మోసాన్ని అరికట్టి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 5 నుంచి 7 కిలోలు కోత విధిస్తున్నారు ఆరుగాలం కష్టపడి పండిచుకున్న మూడేకరాల్లో రబీ సీజన్‌లో సాగు చేశాను. అప్పుచేసి పండించుకున్న పంటను నష్టాలకు విక్రయించాల్సి వస్తుంది. వ్యాపారులు, దళారులు డిజిటల్‌ కాటాతో సరైన తూకం చూపకుండా మోసం చేస్తున్నారు. సుమారు 5 నుంచి 7 కిలోల వరకు తరుగు తీసేస్తున్నారు. డివిజల్‌ కాటా తూకం విధానంలో జరుగుతున్న మోసాలకు అధికారులు చర్యలు తీసుకోవాలి.-ఓబుల్‌రెడ్డి గోపాల్‌రెడ్డి, మున్నెల్లి గ్రామం, బి.కోడూరు. రౖతులు బోర్ల కింద అప్పు చేసి అంతో ఇంతో రబీ సీజన్‌లో మండల వ్యాప్తంగా సుమారు 350 హెక్టార్లలో పత్తిపంటను సాగు చేశారు. ఆరుగాలం కష్టపడి దక్కించుకున్న పత్తి రైతులు వ్యాపారులు, గ్రామ స్థాయి దళారుల చేతుల్లో దోపిడీకి గరవుతున్నారు. వేసవి సీజన్‌కు ముందుగా అంది వచ్చిన పత్తి పంటకు ప్రస్తుతం మార్కెట్‌ ధర రూ. 7,650 ఉంది. వ్యాపారులు, దళారులు కుమ్మక్కై క్విం టాకు రూ. 650 తగ్గిస్తూ రూ. 7 వేలకు కొనుగోలు చేస్తూ రైతులను నష్టాల్లోకి నెడుతున్నారు. పైగా తూకంలో వ్యాపా రులు తెచ్చుకున్న డిజిటల్‌ రిమోట్‌ కాటాలతో కొలతలను వారి ఇష్టం వచ్చినట్లు రిమోట్‌తో కంట్రోల్‌ చేస్తూ తుకాన్ని తగ్గించి రైతులకు చూపుతున్నారు. పత్తిలో తేమ శాతం ఉందని, సరుకు బాగోలేదని సాకు చూపి క్వింటాకు 2 నుంచి 5 కిలోల వరకు తూకం తగ్గించి, ధరలో కూడా కోత విధిస్తున్నారు. ఇందుకు గ్రామస్థాయి దళారులు పూర్తి స్థాయిలో వ్యాపారులకు సహ కరిస్తున్నారు. ఇటీవల శ్రీరామనమి పండుగ రోజు పంటలపై రుసుం పాట వసూళ్లతోపాటు ప్రత్యేక రిమోట్‌ కాటాపై రుసుం పాట పాడి వాటినే వినియోగించాలని రైతులను మభ్యపెట్టి మోసం చేశారు. ఈ విషయంపై రైతులు ఎవరిని అడగాలో తెలియక బోరుమంటున్నారు. మండలస్థాయి వ్యవసా యాధికారులను అడుగుతామంటే డిజిటల్‌ రిమోట్‌ కాటాలు తమ పరిధిలో లేవని జిల్లా స్థాయి తూనికల అధికారులకు ఫిర్యాదు చేసుకోవాలని సూత్రప్రాయంగా సలహాలిస్తున్నారు. ఇలా రైతులు విత్తం నాటినప్పటి నుంచి సరుకును అముకునే వరకు దగ్గా పడుతూనే ఉన్నారు. జిల్లా వ్యవసాయాధికారులు , తూనికల అధికారులు స్పదించి తూకాల్లో మోసాన్ని అరికట్టి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

➡️