గెలుపే లక్ష్యంగా పనిచేయాలి : ఎంఎల్‌ఎ రాపాక

Apr 2,2024 12:30 #Konaseema, #meeting, #MLA

ప్రజాశక్తి-రాజోలు (కోనసీమ) : ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని రాజోలు ఎంఎల్‌ఎ, అమలాపురం వైసిపి పార్లమెంట్‌ అభ్యర్థి రాపాక వరప్రసాదరావు అన్నారు. ప్రతి కుటుంబాన్ని బూత్‌ కమిటీ సభ్యులు సంప్రదించి వైసిపి ప్రభుత్వంలో ఆ కుటుంబానికి అందిన లబ్ధిని వివరించాలని సూచించారు. తాటిపాకలో రాజోలు మండల పరిధిలో ఉన్న బూత్‌ కన్వీనర్లతో మంగళవారం వైసిపి మండల కన్వనర్‌ కట్టా శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాపాక మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో ఎక్కడా లోటుపాట్లు ఉండరాదనే లక్ష్యంతో బూత్‌ కమిటీలను పక్కాగా నియమించామని అన్నారు. ప్రతి ఇంటితోనూ పార్టీ క్యాడర్‌ మమేకం అవ్వవలసిన అవసరం ఉందన్నారు. ఎంఎల్‌ఎ అభ్యర్థి, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు మాట్లాడుతూ … ప్రతి బూత్‌ స్థాయిలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు కలిసి వైసిపి గెలుపే ప్రధానంగా పని చేయాలని కోరారు. ఈ సమావేశంలో జెడ్పిటిసి శైలజా, ఎఎంసి చైర్మన్‌ గుబ్బల రోజారమణి, వైసిపి సినియర్‌ నాయకులు కె.ఎస్‌.ఎన్‌ రాజు, పాటి శివకుమార్‌, కంచర్ల శేఖర్‌, తెన్నేటి కిషోర్‌, సూరిశెట్టి బాబీ, కోటిపల్లి ఎస్తేర్‌ రాణి, నక్కా రామారావు, రేవు జ్యోతి, పలువురు పాల్గొన్నారు.

➡️