‘చెల్లెమ్మవే..’ పాట విడుదల

Feb 23,2024 19:20 #movie, #vijay antoni

విజయ్ ఆంటోని తమిళ రోమియో సినిమాను తెలుగులో ‘లవ్‌గురు’గా వేసవిలో విడుదల చేయబోతున్నారు. మృణాళిని రవి హీరోయిన్‌. విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్‌ బ్యానర్‌పై మీరా అజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. వినాయక్‌ వైద్యనాథన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘చెల్లెమ్మవే..’ అనే సిస్టర్‌ సెంటిమెంట్‌ సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. భాష్యశ్రీ సాహిత్యాన్ని, భరత్‌ ధనశేఖర్‌ స్వరాలను అందించారు. ఆదిత్య ఆర్‌కె ఆలపించారు.

➡️