జూన్‌ 24న ఎమర్జెన్సీ విడుదల

Jan 23,2024 19:30 #kangana ranouth, #movie

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ నటించిన తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఇప్పటికే మూడుసార్లు ఈ సినిమా విడుదల వాయిదాపడిన విషయం తెలిసిందే. తాజాగా ఓ మీడియా ఛానల్‌కు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘జూన్‌ 24న విడుదల చేయాలని నిర్ణయించాం. ఎమర్జెన్సీ నాకు చాలా ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. మణికర్ణిక తర్వాత నేను డైరెక్ట్‌ చేసిన రెండో సినిమా ఇది. ఈ పెద్ద ప్రాజెక్టు కోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభావంతులు పనిచేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం. ఇదొక పీరియాడిక్‌ డ్రామా’ అని వివరించారు.

➡️