హాలీవుడ్‌ కింగ్‌ ఆఫ్‌ కల్ట్‌ రోజర్‌ కన్నుమూత

May 13,2024 21:13 #Cult Roger, #movie

హాలీవుడ్‌కి చెందిన ప్రముఖ దర్శక, నిర్మాత, నటుడు రోజర్‌ విలియం కోర్మన్‌ (98) కన్నుమూశారు. 1926 ఏప్రిల్‌ 5న డెట్రాయిట్‌లో ఆయన జన్మించారు. కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలో ఆయన మృతి చెందారు. 1950లో స్టోరీ రీడర్‌గా ఆయన సినీ కెరీర్‌ మొదలైంది. కెరీర్‌ మొదట్లో ఒడుదొడుకులు ఎదుర్కొన్న తర్వాత తొలిసారిగా ‘మాన్‌స్టర్‌ ఫ్రమ్‌ ది ఓషియన్‌ ఫ్లోర్‌’ అనే ఓ సైన్స్‌ ఫిక్షన్‌ ఫిల్మ్‌ నిర్మించగా మంచి విజయం సాధించింది. రోజర్‌ 50కిపైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. 350కిపైగా సినిమాలను నిర్మించారు. 20కి పైగా సినిమాల్లో నటించారు. హాలీవుడ్‌ పరిశ్రమ రోజర్‌ను రోప్‌ ఆఫ్‌ సినిమా’, ‘ది కింగ్‌ ఆఫ్‌ కల్ట్‌’ వంటి పేర్లతో పిలుచుకుంటుంది. రోజర్‌కు భార్య జూలీ కోర్మన్‌, కుమార్తెలు కేథరీన్‌, మేరీ ఉన్నారు.

➡️