రేవ్‌పార్టీతో నాకు సంబంధం లేదు.. ఆ వార్తలు నమ్మొద్దు : సినీనటి హేమ

తెలంగాణ : బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్‌ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీనటి హేమ స్పష్టం చేశారు. ఆదివారం అర్థరాత్రి బెంగుళూరు శివారులో ఓ వ్యాపారవేత్తకు చెందిన ఫామ్‌ హౌస్‌లో నిర్వహించిన రేవ్‌ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు పట్టుబడ్డారు. దాదాపు 100 మందికి పైగా పార్టీకి హాజరయ్యారు. పార్టీలో పలు రకాల డ్రగ్స్‌ వాడినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆ పార్టీలో నటి హేమ కూడా ఉన్నట్లు వార్తలచ్చాయి. ఈ నేపథ్యంలో … ఈ విషయంపై ఆమె ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ” నేను ఎక్కడకు వెళ్లలేదు. హైదరాబాద్‌లోనే ఉన్నాను. ఇక్కడ ఫామ్‌హౌస్‌లో ఎంజారు చేస్తున్నాను. నాపై వస్తోన్న వార్తలను నమ్మకండి. అవి ఫేక్‌ న్యూస్‌. అక్కడ ఎవరు ఉన్నారో నాకు తెలియదు. దయచేసి మీడియాలో నాపై వచ్చే వార్తలను నమ్మకండి ‘ అని నటి హేమ విజ్ఞప్తి చేశారు.

➡️