సలార్‌ బైక్‌ను సొంతం చేసుకోండి

Apr 20,2024 20:03 #New Movies Updates, #prabhas, #salar

హీరో ప్రభాస్‌- దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం సలార్‌. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బాగానే కనెక్షన్లు సాధించింది. సలార్‌’ రెండో భాగం ‘సలార్‌: శౌర్యంగపర్వం’ పనులను చిత్ర నిర్మాతలు ప్రారంభించారు. ఈ నెలలోనే షూటింగ్‌ పనులు ప్రారంభించేందు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. కాగా, సలార్‌ ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు స్టార్‌ మాలో టెలికాస్ట్‌ కానుంది. ఈ సినిమాను చూస్తూ బైక్‌ను గెలుచుకోవచ్చని హోంబలే ఫిలిమ్స్‌ ప్రకటించింది. సినిమాను చూస్తున్న సమయంలో స్క్రీన్‌పై ఒకవైపు అప్పుడప్పుడు బైకు కనిపిస్తూ ఉంటుందట. అది ఎన్నిసార్లు కనిపించిందో ప్రేక్షకులు లెక్క బెట్టి, 9222211199 నంబర్‌కు SALAAR= అని టైప్‌ చేసి పంపాలట. ఈ ఎస్సెమ్మెస్‌లను ఆదివారం రాత్రి 8 గంటల నుంచి పంపాలని నిర్వాహకులు తెలిపారు.

➡️