ప్రజా తీర్పు

May 13,2024 00:47 #aksharam
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ మల్లికార్జున

ఓటరు మిత్రులారా, తస్మాత్‌ జాగ్రత్త
అక్షరం తెలిసిన వాడికి వెలుగు కలం
పద్దెనికి నిండిన అందరికి ఓటు బలం
కులం, గోత్రం చూస్తే అదే మన మలం
మనం దేనికి లొంగిన మనకి అపజయం
నేటి భారతంలో ఓటరే రేపటి జయం
సమ సమాజాన్ని మార్చేది చదువు
నిరుపేద జీవితానికి మార్పు ఓర్పు
ప్రజా జీవితాన్ని మార్చేది ఓటు
ప్రజా ఓటు కత్తి కన్నా పదునైనది
బలవంతుడికి బలహీనుడు ఎప్పుడూ లోకువే
ఎవ్వరికి భయపడి ప్రజాస్వామ్యానికి ద్రోహం చేయకు
నేటి ప్రజా భారతంలో కురుక్షేత్రం
ప్రతి ఓటరూ ఒక సైనికుడు
యుద్ధ భూమిలో నిశ్శబ్ద యుద్ధం
గన్ను, పెన్ను, కత్తి అవసరం లేదు
నీ చూపుడు వేలే అన్నీ నీకు
ఓటే మన హక్కు ఓటే మన విజయం
నేడే మరువకు ఓటు నా సోదరా!
– తుళ్ళూరు రవి,
99599 77393

➡️