పోలీసు వారి హెచ్చరిక 60 శాతం పూర్తి : బాబ్జీ

Nov 18,2023 19:07 #movie

తూలికా తనిష్క్‌ క్రియేషన్స్‌ పతాకంపై బెల్లి జనార్ధన్‌ తన తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న ‘పోలీస్‌ వారి హెచ్చరిక’ సినిమా షూటింగ్‌ ఇప్పటివరకూ 60 శాతం పూర్తయ్యిందని దర్శకుడు బాబ్జీ వెల్లడించారు. దసరా రోజున ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌, ఘట్‌ కేసర్‌, ఘనాపూర్‌, షామీర్‌ పేట తదితర ప్రదేశాల్లో కొనసాగిందన్నారు. ఇప్పటివరకు జరిగిన షఉటింగ్‌లో సినిమాలోని కీలక ఘట్టాలతో పాటు మూడు పాటలు, రెండు ఫైట్లను పూర్తి చేసుకుందన్నారు. డిసెంబర్‌ మొదటివారం నాటికి షఉటింగ్‌ పూర్తవుతుందన్నారు. ‘మన పిల్లలకు, కుటుంబానికి పంచే ప్రేమలో కొంతైనా మన చుట్టూ వుండే అనాథ బాలలకు పంచకపోతే మన పిల్లల భవిష్యత్తు గురించి చేసే ఆలోచనలో, పడే తపనలో, తీసుకునే జాగ్రత్తలో కొంతైనా అనాథలు, అభాగ్యుల విషయంలో ప్రదర్శించకపోతే వారు సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లో చిక్కుకొని సమాజాన్ని నాశనం చేసే నేరస్థులుగా మారే ప్రమాదం వుందనే సందేశం అంతర్లీనంగా సాగుతూ, పూర్తి కమర్షియల్‌ హంగులతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’ అని బాబ్జీ వివరించారు.

➡️