8న పుష్ప-2 టీజర్‌

Apr 2,2024 19:15 #allu arjun, #movie

సుకుమార్‌, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తున్న ‘పుష్ప-2’ సినిమా టీజర్‌ను ఈనెల 8వ తేదీన విడుదల చేయనున్నట్లుగా చిత్ర నిర్మాతలు ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పుష్ప సినిమాకు సీక్వెల్‌గా పుష్ప-2 షూటింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత పార్ట్‌-3 కూడా ఉంటుందని చిత్రబృందం ప్రకటించింది. పార్ట్‌-2 ఆగస్టు 15న విడుదల కానుంది.

➡️