‘అలసిన ఊపిరి..’ అంటున్న ‘శబరి’

వరలక్ష్మి శరత్‌కుమార్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తోన్న చిత్రం ‘శబరి’. అనిల్‌ కట్జ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘అలసిన ఊపిరి..’ అంటూ సాగే పాటను డైరెక్టర్‌ కరుణకుమార్‌ విడుదల చేశారు. ‘పాట లిరిక్స్‌, విజువల్‌ ప్రెజెంటేషన్‌ నాకు బాగా నచ్చాయి. సినిమాలో చూపించిన తల్లీ కూతుళ్ల సెంటిమెంట్‌ యూనివర్సల్‌ స్థాయిలో ఉంది. సినిమా కోసం టీమ్‌ తమ మనస్సు పెట్టి పనిచేసింది. వరలక్ష్మి లేడీ ఓరియెంటెడ్‌ పాత్రలో అద్భుతంగా నటిస్తున్నారు. దర్శకుడు అనిల్‌ కట్జ్‌ చాలా ఆసక్తికరమైన విషయాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు’ అని కరుణాకర్‌ ఈ సందర్భంగా చిత్ర విశేషాలు పంచుకున్నారు. ఈ చిత్రంలో గణేశ్‌ వెంకట్రామన్‌, మిమే గోపి, సునయన, శశాంక్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ సుందర్‌ సంగీతం అందిస్తున్నారు. మహర్షి కొండ్ల సమర్పణలో మహేంద్ర నాథ్‌ కొండ్ల నిర్మిస్తున్నారు.

➡️