వరుణ్‌తేజ్‌కు జోడీగా సలోని

Nov 27,2023 19:41 #New Movies Updates

వరుణ్‌ తేజ్‌ హీరోగా దర్శకుడు కరుణ కుమార్‌ ‘మట్కా’ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొంత షూటింగ్‌ కూడా జరిగింది. వరుణ్‌ తేజ్‌ వివాహం, తరువాత కుటుంబం, స్నేహితులకి, సన్నిహితులకు విందు ఇవ్వటంతో కొన్నాళ్ళు విరామం తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించబోతున్నారని ఒక అధికారిక ప్రకటన విడుదలైంది. మోహన్‌ చెరుకూరి (సివిఎం), డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్‌ నుండి ఈ సినిమా షఉటింగ్‌ మళ్ళీ మొదలవుతుందని పేర్కొన్నారు. నటి సలోనిని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లుగా తెలిసింది.

➡️