‘టెస్ట్‌’ నయనతార

Nov 18,2023 18:59 #movie

నయనతార నటిస్తున్న కొత్త చిత్రం ‘టెస్ట్‌’. లేడీ ఓరియంటెడ్‌ కథతో రానున్న ఈ చిత్రంలో ఆమె లుక్‌ని తాజాగా చిత్రబృందం విడుదలచేసింది. శనివారం నయనతార పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ లుక్‌ విడుదలచేశారు. ఈ చిత్రంలో ఆర్‌.మాధవన్‌, సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వై నాట్‌ స్టూడియోస్‌ పతాకంపై చక్రవర్తి రామచంద్రన్‌, శశికాంత్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ముగ్గురి జీవితాలు క్రికెట్‌తో ఎలా ముడిపడ్డాయానేది ఈ సినిమా స్టోరీ అని చిత్రబృందం ఓ ప్రకటనలో తెలిపింది.

➡️