Bihar లో కొనసాగుతోన్న లోక్‌ సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌

బీహార్‌ : బీహార్‌లో లోక్‌ సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌ సోమవారం కొనసాగుతోంది. దర్భంగాలోని హౌలీ క్రాస్‌ స్కూల్‌లోని ఆదర్శ్‌ పోలింగ్‌ సెంటర్‌ వద్ద ఉత్సాహంగా ఓటింగ్‌ జరుగుతోంది. ముందుగా ఇద్దరు పెద్దలు తమ ఓటు వేసి, యువత తప్పక ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ పోలింగ్‌ కేంద్రం ముందు పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరారు. జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న బహదూర్‌పూర్‌ బ్లాక్‌లోని బహదూర్‌పూర్‌ పోలింగ్‌ నంబర్‌ 120 వద్ద ఈవీఎంలో సమస్య తలెత్తింది. దీంతో కొద్దిసేపు ఓటింగ్‌ ఆగిపోయింది. బీహార్‌లోని ఐదు స్థానాల్లో నాలుగో దశ పోలింగ్‌ ప్రారంభమైంది. 9,447 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ జరుగుతోంది. చాలా చోట్ల ఉదయం ఆరు గంటలకే ఓటర్లు బూత్‌లకు చేరుకున్నారు. కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ తన సొంత జిల్లా బర్హియాలోని 34వ నంబర్‌ బూత్‌కు చేరుకుని ఓటు వేశారు. ఈ దశ పోలింగ్‌లో కేంద్రమంత్రులు గిరిరాజ్‌ సింగ్‌, నిత్యానంద్‌ రాయ్, జనతాదళ్‌ యునైటెడ్‌ మాజీ జాతీయ అధ్యక్షుడు రాజీవ్‌ రంజన్‌ అలియాస్‌ లలన్‌ సింగ్‌, బీహార్‌ మంత్రి అశోక్‌ చౌదరి కుమార్తె శాంభవి చౌదరి, మంత్రి మహేశ్వర్‌ హజారీ కుమారుడు సన్నీ హజారీతో సహా 55 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు.

➡️