మేమూ మనుషులమేనని నిరూపించుకోవాలి

Dec 26,2023 08:15 #sahityam

యుద్ధ నీతిని మన పెద్దన్న లు గాలికి వదిలేశారు ..!

జనారణ్యంలోకి దారుణ బాంబులు విసరొద్దన్న

నియమావళిని వారు తుంగలో తొక్కారు ..!?

 

ప్రతీకార జ్వాలతో రగిలి శత్రు దేశాలపై

వరుస బాంబుల వర్షం కురిపించి

రణ దాహాన్ని తీర్చి కుంటున్నారు రక్త పిపాసులు ..!

 

ఇజ్రాయిల్‌ పాలస్తీనా మధ్య జరిగిన సమరంలో

పాలస్తీనా లోని నాజూకు గాజా ప్రాంతం

గాజు పాత్రలా భళ్ళున పగిలిపోయింది..!

 

ఇరు దేశాల నడుమ జరిగిన యుద్ధంలో

ఇరవై వేల మంది ప్రజలు హతం

లక్ష లాది జనత నిరాశ్రయులు

వలసబాట పట్టిన వేలాదిమంది పాలస్తీనియన్లు

 

పాలు లేక అల్లాడుతున్న పసిపిల్లలు

కాళ్ళు తెగి విలవిలలాడు తున్న యువత

మందు బిళ్ళలు అందక రోదిస్తున్న వద్ధులు

మంచి నీరు చాలక, ఆహారం దొరకక

ఆర్త నాదాలు చేస్తున్నారు గాజా లోని జనత …!

 

అగ్ర దేశాల ఉగ్ర నేతల్లారా..!

మీ యుద్ధ వాంఛ చివరికి నెర వేరింది..!

యుద్ధం లో రక్త పు ముద్దలుగా పడివున్న

క్షత గాత్రులను క్షమా గుణంతో ఆదరించండి

బాధితులను మానవతా దష్టి తో చూసి

మేమూ మనుషులమే అని ఇకనైనా నిరూపించుకోండి ..!

..జి.సూర్యనారాయణ, 6281725659.

➡️