విధిగా ఓటెయ్యండి

Apr 11,2024 05:20 #edit page

నేను పేరెన్నికగల
ప్రపంచ ప్రతిష్టాత్మక
భారత ప్రజాస్వామ్యాన్ని!
వినమ్రంగా విధేయంగా
వినయంగా అభ్యర్థిస్తున్నా
రాజ్యాంగబద్ధంగా పొందిన
రాజకీయ ఓటు హక్కును
పౌరులందరూ పోలింగ్‌ నాడు
విధిగా వినియోగించమని
మరింత ప్రోత్సహించమని!
రాజకీయ బహిరంగ సభలకు
నాయకుల ప్రచార పర్వానికి
జనమే జనమని వర్ణిస్తారు
జనసందోహమని అభివర్ణిస్తారు
జన సముద్రమని ఉప్పొంగుతారు
తీరా పోలింగ్‌ రోజున పలుచనౌతారు!
నిర్లక్ష్యం నీడన సేదదీరడం సరికాదు
ఉప్పెనలా గడపదాటి విరివిగా రండి
ప్రజాభీష్ట ప్రభుత్వ నిర్మాణ ప్రక్రియలో
సుపరిపాలన నిర్మితిలో భాగమై
నన్ను ప్రగతి పథంలో నడపండి!
నేను ప్రజ్వలంగా వికసించాలంటే
మూలం ఓటు హక్కు వినియోగం.
ఓటు వెయ్యండి ! ఓటు వేయించండి!
నన్ను మీ ఓటుతో దీవించండి !!

– డా.సి.ఎల్‌. చెన్నారెడ్డి,
పౌరశాస్త్ర అధ్యాపకులు,
సెల్‌: 9885791661

➡️